సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ప్రధాన ఆకర్షణగా భారత ఏఐ - గేమింగ్ అంకురసంస్థలు


అయిదు భారతీయ అంకురసంస్థలు యెస్నోమ్, మెటాస్పోర్ట్స్ (హిట్‌వికెట్), కోయోజో, యూత్ బజ్ (అవర్‌కాడియమ్), ఎవైవీల ఏఐ-ఆధారిత గేమింగ్, లీనమయ్యే ఆవిష్కరణల ప్రదర్శన

‘ది న్యూ గోల్డ్ రష్: ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియాస్ ఏఐ-పవర్డ్ గేమింగ్ ఫ్యూచర్’ ప్యానెల్, గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 3:36PM by PIB Hyderabad

కృత్రిమ మేధ గురించిన ప్రపంచస్థాయి కీలక సమావేశంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026... ఆయా పరిశ్రమల్లో ఏఐ పరివర్తనాత్మక ప్రభావాన్ని అన్వేషించడం కోసం ప్రభుత్వాలుసాంకేతిక ప్రముఖులుఅంకురసంస్థలుపెట్టుబడిదారులుపరిశోధకులువిధాన రూపకర్తలను ఒకచోట చేర్చే వేదికగా నిలిచిందివాస్తవ ప్రపంచంలో ఏఐ అనువర్తనాలను ప్రదర్శించడానికిప్రపంచ సహకారాన్ని పెంపొందించడానికి కీలక వేదికగా నిలిచిన ఈ సదస్సు... ఏఐ-ఆధారిత ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

గేమింగ్-ఇంటరాక్టివ్ టెక్నాలజీ కేటగిరీ కింద అయిదు అగ్రగామి భారతీయ అంకురసంస్థలైన యెస్నోమ్మెటాస్పోర్ట్స్ (హిట్‌వికెట్), కోయోజోయూత్ బజ్ (అవర్‌కాడియమ్), ఎవైవీలు అత్యాధునిక ఏఐ-ఆధారిత పరిష్కారాలను ప్రదర్శిస్తాయిఏఐగేమింగ్ఇమ్మర్సివ్ మీడియావ్యాపారరంగ పరివర్తన రంగాల్లో మెరుగవుతున్న భారత్ నాయకత్వాన్ని హైలైట్ చేస్తాయి.

ఏఐ-ఆధారిత సృజనాత్మక నిర్మాణం

గేమ్ స్టూడియోలుసృజనాత్మక బృందాల కోసం నిర్మించిన తమ ఏఐ-ఆధారిత ఆర్ట్ క్రియేషన్ వేదిక స్కెట్లీ ఏఐని యెస్నోమ్ ప్రదర్శిస్తుందివేగంస్థిరత్వంశైలి సంబంధిత నియంత్రణతో క్యారెక్టర్ డిజైన్స్ఎన్విరాన్మెంట్స్యూఐ ఎలిమెంట్స్స్టోరీబోర్డులుయానిమేషన్ భాగాలు సహా నిర్మాణానికి సిద్ధంగా ఉన్న గేమ్ అసెట్స్ రూపకల్పనకు ఈ ప్లాట్‌ఫామ్ వీలు కల్పిస్తుంది.


 

దీని ముఖ్య లక్షణం యాజమాన్య శైలి-శిక్షణ వ్యవస్థభారీ-స్థాయి నిర్మాణాల్లో సమన్వయాన్ని కొనసాగించడానికి సునిర్వచిత దృశ్య సౌందర్యం విషయంగా స్టూడియోలు ఏఐకి శిక్షణనివ్వడానికి ఇది అనుమతిస్తుందివేగవంతమైన పునరావృతంస్ప్రైట్ షీట్ క్రియేషన్అసెట్‌ను మెరుగుపరచడంవిస్తరణ సాధనాలను ఉపయోగించే సౌకర్యం వల్ల స్కెట్లీ ఏఐ... నిర్మాణ పనులను క్రమబద్ధీకరించడంఅవరోధాలను తగ్గించడంసరసమైన ఖర్చుతో క్రియేటివ్ అసెట్‌ల పరిమాణాన్ని పెంచడంలో క్రియేటర్ల బృందాలుగ్లోబల్ స్టూడియోలను శక్తిమంతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది.

లైవ్ స్పోర్ట్స్ గేమింగ్‌లో జనరేటివ్ ఏఐ

ప్రపంచవ్యాప్తంగా 1.8 కోట్లకు పైగా వినియోగదారులతో బహుళ ప్లేయర్స్ పోటీపడగల క్రికెట్ గేమ్ అయిన హిట్‌వికెట్‌ను మెటాస్పోర్ట్స్ ప్రదర్శిస్తుందిఈ కంపెనీ తన జనరేటివ్ ఏఐ-ఆధారిత రియల్-టైమ్ కామెంటరీ ఇంజిన్‌ను సదస్సులో ప్రదర్శిస్తుంది.

ఈ వ్యవస్థ ప్రత్యక్ష గేమ్‌ప్లే దృశ్యాలను విశ్లేషిస్తుంది. సందర్భోచిత వచన వ్యాఖ్యానాన్ని రూపొందిస్తుందిదానిని వ్యక్తీకరణ వాయిస్ అవుట్‌పుట్‌గా మారుస్తుందిప్రతి మ్యాచ్‌ కోసం వ్యక్తిగతీకరించిన వ్యాఖ్యాన అనుభవాన్ని అందిస్తుందిలైవ్ స్పోర్ట్స్ గేమ్‌ప్లేలో ఏఐ-ఆధారిత స్టోరీటెల్లింగ్‌ను అనుసంధానించడం ద్వారా మొబైల్ గేమింగ్‌లో జనరేటివ్ ఏఐ ఇమ్మర్షన్వ్యక్తిగతీకరణప్రసార-నాణ్యత ఇంటరాక్టివిటీని ఎలా మెరుగుపరుస్తుందో హిట్‌వికెట్ ప్రదర్శిస్తుంది.

కన్సోల్-గ్రేడ్ మొబైల్ గేమింగ్ వ్యవస్థ

స్మార్ట్‌ఫోన్‌లను కన్సోల్-గ్రేడ్ గేమింగ్ పరికరాలుగా మార్చడానికి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ మొబైల్ హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ వ్యవస్థను కోయోజో ప్రదర్శిస్తుంది.

దీని ప్రధాన హార్డ్‌వేర్ అయిన కోయోజో వన్... హాల్-ఎఫెక్ట్ జాయ్‌స్టిక్‌లుట్రిగ్గర్‌లుడ్యూయల్ కనెక్టివిటీ (టైప్-సిబ్లూటూత్), హాప్టిక్ ఫీడ్‌బ్యాక్మాడ్యులర్ యాక్సెసరీ మద్దతుపాస్-త్రూ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉందిఈ పరికరానికి అనుబంధంగా కోయోజో క్లబ్ ఉంటుందిఇది ఆటో బటన్ మ్యాపింగ్గేమ్ డిస్కవరీరిమోట్ ప్లే ఇంటిగ్రేషన్పనితీరు ఇన్‌సైట్స్వ్యక్తిగతీకరించిన నియంత్రణ ప్రొఫైల్‌లను అందించే ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫారమ్ లేయర్.

పోటీతో కూడిన ఆట, లీనమయ్యే అనుభవం కోసం మెరుగుపరిచిన సజావైనమెరుగైన-పనితీరు గల హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా ఇవన్నీ కలిసిన ఈ వ్యవస్థ భారత మొబైల్ గేమింగ్ మార్కెట్‌లోని ఫ్రాగ్మెంటేషన్‌ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

మానవులు వర్సెస్ ఏఐ: ఇంటరాక్టివ్ ప్రదర్శన

లీనమయ్యే అనుభవాన్ని అందించే తన సాంకేతిక వేదిక అవర్‌కాడియం ద్వారా మానవ సృజనాత్మకత, ఏఐ అనుసరణ మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాన్ని అన్వేషించే ఇంటరాక్టివ్ గేమ్‌ప్లే అనుభవమైన “మ్యాన్ వర్సెస్ జీపీటీ”ని యూత్ బజ్ ప్రదర్శిస్తుంది.


 

ప్రవర్తనా నమూనా, సకాలంలో నిర్ణయాలు తీసుకునే లూప్‌లను ఉపయోగించి రౌండ్ల వారీగా నేర్చుకునేఅనుసరించే ఏఐఆధారిత ప్రత్యర్థులతో కొందరు వ్యక్తులు ప్రత్యక్ష ప్రదర్శనలో పోటీపడతారువినియోగదారుల సామర్థ్యంపనితీరువాతావరణంలో మార్పులకు అనుగుణంగా తమ కష్టతరమైన స్థాయిని స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకునే సాంకేతికతలనుఇంటెలిజెంట్ ఇంటరాక్షన్ నమూనాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు అనుకూలమైన ఫార్మాట్‌గా రూపొందించిన ఈ అనుభవం సంక్లిష్టమైన ఏఐ భావనలను ఆకర్షణీయమైన గేమ్‌ప్లేగా సులభతరం చేస్తుంది,


 

మేడ్-ఇన్-ఇండియా మేధో సంపత్తిగా ఈ ప్రదర్శన... విస్తరిస్తున్న డిజిటల్ వ్యవస్థలో అసలైన లీనమయ్యే అనుభూతిని కలిగించే వినోద ఫార్మాట్‌ల వైపు భారత్ పురోగమనాన్ని స్పష్టం చేస్తుంది.

కాగ్నిటివ్ ఏఐ సంసిద్ధతను తెలుసుకోవడం

ప్రపంచ ప్రవర్తనాపరమైన మేధస్సు, సంస్థాగత పరివర్త ల్యాబ్ అయిన ఎవైవీ... ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో ఒక సంస్థ సన్నద్ధతను తెలుసుకునే సాధనం అయిన తన ఎంటర్‌ప్రైజ్ కాగ్నిటివ్ ఏఐ రెడీనెస్ టూల్‌ను ఈ సదస్సులో ఆవిష్కరిస్తుందిఏఐ సాంకేతికత అమలులో "మానవ అభిజ్ఞాపరమైన మౌలికసదుపాయాలఅంతరాన్ని ఇది హైలైట్ చేస్తుంది.

నాయకులు సమస్యలను ఎలా రూపొందిస్తారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటారువాటిని ఎలా అమలు చేస్తారో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌తో ఈ సాధనం మూల్యాంకనం చేసిన్యూరోసైన్స్ ఆధారిత ఏఎఫ్ఈఆర్ఆర్ మోడల్ యాక్టివేషన్ఫోర్‌కాస్టింగ్ఎక్స్‌పెరిమెంటేషన్రియలైజేషన్రిఫ్లెక్షన్ ఆధారంగా... సాంప్రదాయిక సాంకేతిక చెక్‌లిస్టులను మించి నాయకత్వంసంస్థాగత సంసిద్ధతలను అంచనా వేస్తుంది.

ఎవైవీ బూత్ లైవ్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌గా పనిచేస్తుంది. ఇక్కడ విధాన నిర్ణేతలువ్యాపార ప్రముఖులు ఎగ్జిక్యూటివ్ సిములేషన్స్‌లో పాల్గొనవచ్చుఈ సమ్మిట్ సమయంలో ఏఐ నాయకత్వ సంసిద్ధతను నిజ సమయంలో కొలిచే "స్టేట్ ఆఫ్ కాగ్నిషన్ఇండియా ఏఐ స్నాప్‌షాట్-2026"నూ కంపెనీ ప్రదర్శిస్తుంది.

భారత ఏఐ గేమింగ్ భవిష్యత్తులో పెట్టుబడులు

గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్న “ది న్యూ గోల్డ్ రష్: ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియాస్ ఏఐ-పవర్డ్ గేమింగ్ ఫ్యూచర్” అనే ప్రత్యేక ప్యానెల్ చర్చ... ఏఐ-ఆధారిత గేమ్ డెవలప్‌మెంట్ఇంటరాక్టివ్ మీడియాలో విస్తరిస్తున్న భారత్ ప్రభావాన్ని చర్చించడానికి ప్రపంచ పెట్టుబడిదారులుపరిశ్రమ నాయకులను సమావేశపరుస్తుంది.

ఏఐ-ఆధారిత గేమింగ్ ఆవిష్కరణలో ప్రపంచ ప్రధాన కేంద్రంగా భారత్ ఎదుగుదలను వేగవంతం చేయడానికి అవసరమైన అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ధోరణులుఏఐఆధారిత ఉత్పత్తి నమూనాలునైపుణ్య కార్యక్రమాలువిధాన ప్రణాళికలను ఈ సమావేశం చర్చిస్తుంది.

ఈ ఐదు అంకురసంస్థల భాగస్వామ్యం ఏఐ-ఆధారిత గేమింగ్లీనమయ్యే అనుభవాలుఅభిజ్ఞాపరమైన పరివర్తనఇంటరాక్టివ్ స్టోరీటెల్లింగ్‌లో విస్తరిస్తున్న భారత సామర్థ్యాలను స్పష్టం చేస్తుందిఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో వారి ఉనికి ప్రపంచంతో పోటీపడే ఏఐ-నేటివ్ వేదికలను నిర్మించడంతదుపరి తరం డిజిటల్ ఆవిష్కరణల్లో భారత్‌ను ముందంజలో నిలపాలనే విస్తృత జాతీయ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2228855) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Tamil , Kannada , Malayalam