ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బంగ్లాదేశ్ ఎన్నికల విజయంపై తారిఖ్‌ రహ్మాన్‌కు అభినందనలు తెలియజేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


ద్వైపాక్షిక సంబంధాల పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 13 FEB 2026 4:40PM by PIB Hyderabad

బంగ్లాదేశ్ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై తారిఖ్‌ రహ్మాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఆయనతో ప్రధాని ఇవాళ ఫోన్‌లో మాట్లాడారు. 

బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తారిఖ్‌ రహ్మాన్‌ చేసే ప్రయత్నాలకు మద్దతును తెలియజేసిన ప్రధాని.. ఈ విషయంలో శుభాకాంక్షలు తెలియజేశారు. 

రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను ప్రస్తావించిన ప్రధాని.. భారత్, బంగ్లాదేశ్‌లు లోతైన చారిత్రక, సాంస్కృతిక బంధాలతో ముడిపడి ఉన్న పొరుగు దేశాలని పేర్కొన్నారు. రెండు దేశాల శాంతి, పురోగతి, ప్రజల శ్రేయస్సు పట్ల భారత్‌ నిబద్ధతను కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:

“శ్రీ తారిఖ్‌ రహ్మాన్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బంగ్లాదేశ్ ఎన్నికలలో అద్భుత విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశాను.

బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన చేసే కృషికి నా శుభాకాంక్షలు, మద్దతును తెలిపాను. 

లోతైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కలిగిన సన్నిహిత పొరుగు దేశాలుగా మన ఉభయ దేశాల ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారతదేశ నిరంతర నిబద్ధతను నేను మరోసారి స్పష్టం చేశాను.”

@trahmanbnp”


(रिलीज़ आईडी: 2228193) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam