మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యాంజలి కార్యక్రమంలో చేరిన 8.5 లక్షల పాఠశాలలు, 5 లక్షల మంది వాలంటీర్లు: రాజ్యసభలో శ్రీ జయంత్ చౌధరి

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 8:13PM by PIB Hyderabad

విద్యాంజలి కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక రంగం సహాయ మంత్రి (స్వతంత్ర), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి రాజ్యసభలో ఈరోజు సమాధానమిచ్చారుఈ కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని ఆయన సభకు తెలియజేశారుసామాజికప్రైవేటు రంగ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసివిద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడంఅభ్యాసన ఫలితాలను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా సెప్టెంబర్ 2021లో విద్యాంజలి కార్యక్రమం ప్రారంభమైందినిర్మాణాత్మకమైన సామాజిక భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుందిఈ వేదిక వాలంటీర్లుపూర్వ విద్యార్థులుసంస్థలుస్వచ్ఛంద సంస్థలుసీఎస్ఆర్ భాగస్వాములను నేరుగా బడులతో అనుసంధానిస్తుందిపాఠశాలల్లో గుర్తించిన అవసరాల ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది.

2021 సెప్టెంబర్‌లో ప్రారంభమైన నాటి నుంచి విద్యాంజలి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారుగా 8.5 లక్షల పాఠశాలలుదాదాపు లక్షల మంది వాలంటీర్లు చేరారని మంత్రి సభకు తెలియజేశారుఈ వేదిక సేవలుకార్యకలాపాలువిరాళాల రూపంలో సహకారాన్ని అందిస్తుందివాటిలో పాఠ్యాంశాల బోధనకెరీర్ కౌన్సెలింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కోడింగ్ లాంటి నూతన రంగాలపై వర్కుషాపులుప్రత్యేక అవసరాలున్న పిల్లలకు తోడ్పాటుక్రీడలుసాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయివీటితో పాటుగా అలాగే బోధనా సామగ్రిఐసిటి సౌకర్యాలుప్రయోగశాలలుపారిశుద్ధ్య మౌలిక సదుపాయాలుపునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించడం కూడా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కోట్ల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం అందిస్తూ ఇప్పటి వరకు 56,734కు పైగా సేవా కార్యకలాపాలు, 35,695 వస్తు విరాళాలు అందాయిసమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరచడానికిబడుల్లో వనరులను బలోపేతం చేయడానికి విద్యాంజలి కార్యక్రమం సహకరించిందని మంత్రి చెప్పారు.

అనుమతులుపర్యవేక్షణఫీడ్‌బ్యాక్ వ్యవస్థను పర్యవేక్షించే నిర్మాణాత్మక డిజిటల్ విధానం ద్వారా ఈ కార్యక్రమం పనిచేస్తుందని ఆయన తెలియజేశారుడాష్‌బోర్డ్‌ల ద్వారా రాష్ట్రాలు పురోగతిని సమీక్షిస్తాయిపాఠశాలలు స్వచ్ఛంద సేవల వివరాలను ధ్రువీకరిస్తాయిఇది పారదర్శకతనుజవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది.

పాఠశాల విద్యలో ప్రజల భాగస్వామ్య స్ఫూర్తిని విద్యాంజలి ప్రతిబింబిస్తుందిఅలాగే ప్రభుత్వఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు తోడ్పాటు అందించేలా భాగస్యాములను ప్రోత్సహిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2227465) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi