సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ ప్రణాళిక

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 4:08PM by PIB Hyderabad

(ఎ): సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ పథకం (డబ్ల్యూఎల్ జీఎస్ పీ) కింద మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాను ప్రయోగాత్మక జిల్లాగా ఎంపిక చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టు కింద బాలాఘాట్ జిల్లాలోని బహుదేశీయ ప్రాథమిక కృషి శాఖ సహకారి సొసైటీ మర్యాదిత్ పరస్వాడ వద్ద 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును నిర్మించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవ్వగా.. దీనిని 24 ఫిబ్రవరి 2024న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ గోదామును మధ్యప్రదేశ్ గోదాంరవాణా కార్పొరేషన్ అద్దెకు తీసుకుంది.

(బి): ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల అనుసంధానం ద్వారా పీఏసీఎస్ఇతర సహకార సంఘాల స్థాయిలో అమలు చేస్తున్నారు. అవి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్)వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల పథకం (ఏఎంఐ)వ్యవసాయ యాంత్రీకరణపై సబ్ మిషన్ (ఎస్ఎంఏఎం)ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం (పీఎంఎఫ్ఎంఈ) మొదలైనవి. ఏఐఎఫ్ పథకం కింద గోదాముల నిర్మాణం కోసం తీసుకున్న రుణంపై వడ్డీ రాయితీ ప్రయోజనం పీఏసీఎస్ లకు అందిస్తున్నారు. అలాగే ఏఎంఐ పథకం కింద ఆహార ధాన్యాల నిల్వ కేంద్రాల నిర్మాణానికి సబ్సిడీ అందిస్తున్నారు. పీఏసీఎస్ ల కోసం ఏఐఎఫ్ పథకం కింద రుణ తిరిగి చెల్లింపు వ్యవధిని 2+5 నుంచి 2+8 సంవత్సరాలకు వ్యవసాయంరైతు సంక్షేమ శాఖ పొడిగించింది. ఏఎంఐ పథకం కింద ఈ కింది సవరణలు కూడా చేసింది.

·         మర్జిన్ మనీ(సొంత నగదు వాటా) అవసరాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించింది.

·         నిర్మాణ వ్యయాన్ని సాధారణ ప్రాంతాలలో టన్నుకు రూ. 3000–3500 నుంచి రూ. 7000కిఈశాన్య రాష్ట్రాల్లో టన్నుకు రూ.4000 నుంచి రూ.8000కి సవరించింది.

·         పీఏసీఎస్ కోసం సబ్సిడీని 25 నుంచి 33.33 శాతానికి పెంచింది. (సాధారణ ప్రాంతాల్లో టన్నుకు రూ 875 నుంచి రూ2333కి.. ఈశాన్య రాష్ట్రాలలో టన్నుకు రూ. 1333.33 నుంచి రూ. 2666కి పెరిగింది).

·         పీఏసీఎస్ ల కోసం అంతర్గత రోడ్లుతూకం యంత్రాలుప్రహరీ గోడలు వంటి అనుబంధ మౌలిక సదుపాయాల కోసం మొత్తం అర్హత ఉన్న సబ్సిడీలో అదనంగా 1/3 (మూడో వంతు) సబ్సిడీని అందించే నిబంధన చేర్చింది.

ఈ పథకాల అనుసంధానం వల్ల రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగా నిల్వ చేసుకోవడానికినిల్వ ఉంచిన ధాన్యంపై రుణం పొందడానికిసరైన సమయంలో విక్రయించుకోవడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా చిన్నసన్నకారు రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు.

(సి) గ్రామం లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్థాయిలో వికేంద్రీకృత నిల్వ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పంట కోత తర్వాత నష్టాలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఇది పొలాలకు సమీపంలోనే శాస్త్రీయ నిల్వ పద్ధతులను అందుబాటులోకి తెవడంతోపాటు ధాన్యం తరలింపు ప్రక్రియను తగ్గిస్తుంది. స్థానికంగా నిల్వ సౌకర్యాలు ఉండటం వల్ల సుదూర ప్రాంతాల్లోని గిడ్డంగులకు లేదా మండీలకు పదేపదే పంటను తరలించాల్సిన అవసరం తగ్గుతుంది. దీని ద్వారా ప్రయాణ దూరందానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయి. ఈ చర్యలు రైతులకు మెరుగైన ధర లభించేలా చేయడమే కాకుండా సరఫరా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఆహార భద్రతను బలోపేతం చేస్తాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2226705) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi