హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ జరిగిన బస్తర్ పాండమ్-2026 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


బస్తర్ అంటే బారుద్ కాదు.. సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వం

వంటకాలు, నృత్యాలు సహా బస్తర్ సంస్కృతిలోని 12 విభాగాలు అంతర్భాగంగా స్థానిక సంస్కృతికి పునరుజ్జీవం పోసిన బస్తర్ పాండమ్

బస్తర్ పాండమ్‌లో పాల్గొన్న 55,000 మంది గిరిజనులు.. నక్సలిజం నుంచి బస్తర్ విముక్తికి నిదర్శనం

గిరిజన వర్గాల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ, బస్తర్ ప్రాంత నృత్యాలు, కళలు, గిరిజన సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపునిస్తున్న మోదీ ప్రభుత్వం

లొంగిపోయే నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తున్న ప్రభుత్వం.. ఆయుధాలు పడితే ధీటైన ప్రతిస్పందన

రాబోయే ఐదేళ్లలో గిరిజన ప్రాంతాల్లో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా బస్తర్.. కొత్త పర్యాటక కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి మెరుగుపడనున్న బస్తర్

భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా, ఆయన 150వ జయంతి వేడుకలను జనజాతీయ గౌరవ సంవత్సరంగా ప్రకటన.. గిరిజన తెగలకు ప్రధానమంత్రి మోదీ ఇస్తున్న గౌరవం, వారసత్వ ప్రాధాన్యతకు నిదర్శనం

గిరిజన రైతులు, అమాయక పిల్లలు, మహిళల సంరక్షణే నక్సల్ వ్యతిరేక పోరాట లక్ష్యం

118 ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న నూతన పారిశ్రామిక ప్రాంతం, బస్తర్ ప్రజల ఉపాధికి బలమైన ఆధారం

బస్తర్ సంస్కృతిని దేశ విదేశాలకు పరిచయం చేయాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష

నాడు పోస్టు చేయడమైనది: 09 FEB 2026 6:53PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ జరిగిన బస్తర్ పాండమ్-2026 ముగింపు వేడుకలకు కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్‌సాయ్ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కొన్నేళ్ల కిందటి వరకు నక్సలైట్ల నీడలో ఉన్న బస్తర్ ప్రాంతంలో మోర్టార్ షెల్స్తుపాకీ మోతలుఐఈడీ పేలుళ్లు గిరిజన సోదరీసోదరులను వణికించేవని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారుకానీ నేడు అదే బస్తర్‌లో సుమారు 55 వేల మంది ప్రజలు కలిసి వంటకాలుపాటలునృత్యంనాటకంవేషధారణసంప్రదాయాలుఅటవీ ఆధారిత వైద్యం వంటి 12 విభాగాలు అంతర్భాగంగా స్థానిక సంస్కృతికి పునరుజ్జీవం పోశారుఇది నిజంగా ఒక గొప్ప విజయం.

బస్తర్ సంస్కృతికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పునరుజ్జీవం పోసిందని శ్రీ అమిత్ షా కొనియాడారుగత బస్తర్ పాండమ్ సందర్భంగా కేవలం విభాగాల్లో పోటీలు నిర్వహించగాఈసారి మరో కొత్త విభాగాలను జోడించి గిరిజనబస్తర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్‌సాయ్ కృషి చేశారన్నారుమొత్తం 12 విభాగాల్లో జిల్లాల నుంచి సుమారు 55,000 మంది క్రీడాకారులుకళాకారులు.. 1,885 గ్రామ పంచాయతీలు, 32 బ్లాక్ ప్రధాన కార్యాలయాల నుంచి పెద్దఎత్తున ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

బస్తర్ ప్రాంత కళలుసంస్కృతి ప్రపంచంలోని మరే ఇతర గిరిజన ప్రాంతంలోనూ లేవనివందల ఏళ్ల వరకు మనం వాటిని భద్రపరుచుకోవాలని కేంద్ర హోం మంత్రి అన్నారుబస్తర్ కళలుసంస్కృతిపాటలునృత్యాలు కేవలం బస్తర్‌కు మాత్రమే గర్వకారణం కాదనిఅవి భారతీయ సంస్కృతి కిరీటంలోని మణిహారాల వంటివని.. బస్తర్ పాండమ్ ఈ గొప్ప వారసత్వాన్ని మరింతగా చాటిచెప్పిందని కొనియాడారుబస్తర్ తెగలకు తమదైన ప్రత్యేక సంస్కృతి ఉందన్నారుశ్రీరాముడి కాలం నుంచి తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారురానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రధాన నృత్యాలు జాతీయ స్థాయి గుర్తింపును పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బస్తర్ సంస్కృతిని జాతీయ స్థాయిలోనే కాకప్రపంచ స్థాయికి తీసుకెళ్లటమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర హోంసహకార మంత్రి తెలిపారుబస్తర్ అంటే బారుద్ కాదనిసుసంపన్నమైన సంస్కృతివారసత్వమని అన్నారుగిరిజన వర్గాల రక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామనిబస్తర్ నృత్యాలుకళలుగిరిజన సంస్కృతికి మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపును కల్పిస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారుచరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో రాసింది మాత్రమే కాదనిప్రజల జ్ఞాపకాల్లో సజీవంగా ఉండేదే నిజమైన చరిత్రని ప్రధానమంత్రి మోదీ బలంగా విశ్వసిస్తారని పేర్కొన్నారు.

భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగాఆయన 150వ జయంతి వేడుకలను జనజాతీయ గౌరవ సంవత్సరంగా ప్రకటించటం.. గిరిజన సమాజం పట్ల ప్రధానమంత్రి మోదీకున్న గౌరవానికి నిదర్శనమని శ్రీ అమిత్ షా తెలిపారుగిరిజన హస్తకళలుసంస్కృతివంటకాలుఅటవీ ఉత్పత్తుల వాణిజ్య వినియోగాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రోత్సహించారనిసుమారు ఐదు లక్షల అటవీ ఉత్పత్తులుసంప్రదాయ హస్తకళల బ్రాండింగ్మార్కెటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు.

నారాయణపూర్‌కు చెందిన పండిట్ రామ్ మాండవిహేమ్‌చంద్ మాంఝీకాంకేర్‌కు చెందిన అజయ్ కుమార్ మాండవిదంతెవాడకు చెందిన భూధారి దాతీ.. కళఆరోగ్యంవిద్యారంగాల్లో చేసిన విశేష కృషికిగానూ పద్మ అవార్డులతో సత్కరించటం ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి తెలిపారు. 700లకు పైగా గిరిజన తెగలను గౌరవించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారుస్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గిరిజన నాయకులందరి స్మృతులను చిరస్థాయిగా నిలిచేలా చేసేందుకు రూ.200 కోట్ల వ్యయంతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటునకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు.

బస్తర్ పాండమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారత రాష్ట్రపతికి కేంద్ర హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారుఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అమిత్ షా.. మొత్తం 12 విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలను రాష్ట్రపతి భవన్‌లో విందుకు ఆహ్వానించాల్సిందిగా కోరగారాష్ట్రపతి అంగీకరించినట్లు తెలిపారుఈ విజేతలు రాష్ట్రపతి భవన్‌లో తమ కళలనుసంస్కృతిని ప్రదర్శిస్తారనిఇది వారికి దక్కే గొప్ప గౌరవమని అన్నారు

గిరిజన రైతులుఅమాయక పిల్లలుమహిళల సంరక్షణే నక్సల్ వ్యతిరేక పోరాట లక్ష్యమని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారునక్సలైట్లు ఐఈడీలను అమర్చేటప్పుడువాటిపై గిరిజన రైతులు పొరపాటున కాలు వేస్తే వారు శాశ్వతంగా వికలాంగులయ్యే ప్రమాదం ఉందన్న స్పృహ వారికి లేదాఈ చర్యల వల్ల ఒక అమాయకపు బిడ్డ జీవితం చిన్నాభిన్నం అవుతుందని వారు గ్రహించలేరానక్సలైట్లు ఇంత క్రూరంగా ఎలా ఉంటారుఅని ఆవేదన వ్యక్తం చేశారుఆయుధాలను వీడాలని మిగిలిన నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తూలొంగిపోయే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందనివారికి గౌరవప్రదంగా పునరావాసం కల్పిస్తుందని కేంద్ర హోంమంత్రి భరోసా ఇచ్చారుఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ఎంతో ఆకర్షణీయంగా ఉందని శ్రీ అమిత్ షా అన్నారు.

నక్సలైట్లందరూతమ కుమార్తెలను పునరావాసం కోసం పంపాలని శ్రీ అమిత్ షా విజ్ఞప్తి చేశారుఆ అమ్మాయిలకు ఎంతో భవిష్యత్తు ఉందన్నారుభారీ సంఖ్యలో లొంగిపోయిన నక్సలైట్లకు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చారుగ్రామాల్లో తూటాలు పేలుస్తూపొలాల్లోరోడ్లపై ఐఈడీ బాంబులు అమర్చుతూపాఠశాలలుఆస్పత్రులను తగలబెడుతూమొబైల్ టవర్లను ధ్వంసం చేసే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదనిఆయుధాలకు ఆయుధాలతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.

దేశం ముందు నేడు బస్తర్ ఒక అద్భుతమైన బ్రాండ్‌గా మారిందని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి తెలిపారు. 40 ఏళ్లుగా మూతపడిన ఎన్నో పాఠశాలలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందిపాఠశాలలను మూసివేయటం ద్వారా నక్సలైట్లు ఎవరికి ప్రయోజనం చేకూర్చారుఅని అక్కడి గిరిజన సోదరీసోదరులను ఆయన ప్రశ్నించారుదీనివల్ల మన నవతరం ప్రాథమిక విద్యకు దూరమైందన్నారువచ్చే ఐదేళ్లలోఅన్ని గిరిజన ప్రాంతాల కంటే బస్తర్ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుతుందనికొత్త పర్యాటక కార్యక్రమాల ద్వారా బస్తర్‌లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని శ్రీ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారుమూసివేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుఆస్పత్రులుపాఠశాలలన్నింటినీ తిరిగి ప్రారంభిస్తామనిఅలాగే ఉన్నత పాఠశాలలుకళాశాలలను కూడా నిర్మిస్తామని చెప్పారుఇప్పుడు ప్రతి గ్రామంలో పోస్టాఫీసులు తెరుచుకుంటున్నాయనిమొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామనిగ్రామాలను అనుసంధానించే రహదారులను నిర్మిస్తున్నామని వెల్లడించారుచాలా గ్రామాల్లో నాలుగు దశాబ్దాల తర్వాత జాతీయ జెండామన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.

ప్రతి గ్రామానికి అనుసంధానత కల్పిస్తామనిప్రతి కిలోమీటర్ల పరిధిలో ఒక పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖను ఏర్పాటు చేస్తామని శ్రీ అమిత్ షా తెలిపారుగిరిజన రైతుల నుంచి ప్రతి క్వింటాలు వరిని రూ.3,100 చొప్పున సేకరిస్తామనిప్రతి గిరిజన వ్యక్తికి నెలకు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారుప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లుకుళాయి కనెక్షన్ల ద్వారా మంచినీటిని అందిస్తామని తెలిపారుపంచాయతీమండల పంచాయతీజిల్లా పంచాయతీల్లో ఎన్నికైన ప్రతినిధులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేశారునక్సలిజం అంతమైన తర్వాత బస్తర్ ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజంహోమ్‌స్టేలుకానోపీ వాక్గ్లాస్ బ్రిడ్జి వంటి సరికొత్త పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చెందుతాయనితద్వారా బస్తర్‌ను అగ్రపథంలో నిలుపుతామని చెప్పారుగిరిజన యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బస్తర్‌లో 118 ఎకరాల్లో కొత్త పారిశ్రామిక ప్రాంతాన్నిఆటో గిగ్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు శ్రీ అమిత్ షా వెల్లడించారు.

రావ్‌ఘాట్–జగదల్‌పూర్ రైల్వే ప్రాజెక్టు పనులను రూ.3,500 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారుదీనితో పాటు నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామనిదాదాపు 90,000 మంది యువతకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారుఇంద్రావతి నదిపై రూ. 36 కోట్ల అంచనా వ్యయంతో కొత్త నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంబిస్తామనిదీనిద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.

బస్తర్‌లో ఎక్కడా కర్ఫ్యూ వాతావరణం లేదనిరాత్రివేళల్లో గ్రామాల్లో గిరిజన సాంస్కృతిక నృత్యాల సందడి కనిపిస్తోందని.. ఇది బస్తర్‌లో అతిపెద్ద మార్పు అని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారుబస్తర్ ఒలింపిక్స్ విజయవంతంగా నిర్వహించామనిఇప్పుడు బస్తర్ పాండమ్‌ను విస్తృతం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారునక్సలిజానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాల్గొంటున్న భద్రతా దళాలకు బస్తర్ గిరిజన ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారుఈ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారునిర్ణీత గడువులోగా బస్తర్‌ను పూర్తిగా నక్సల్ రహిత ప్రాంతంగా మారుస్తామనిఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు

 

***


(రిలీజ్ ఐడి: 2225828) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam