ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విద్యార్థుల అపార ప్రతిభనీ, ‘పరీక్షా పే చర్చా’ స్ఫూర్తినీ చాటిచెబుతూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 FEB 2026 9:06AM by PIB Hyderabad

మన విద్యార్థుల్లో అసాధారణ ప్రతిభ సమృద్ధిగా ఉందనీవారిలో తమ కలలను నిజం చేసుకొనేందుకు పూర్తి సామర్థ్యం ఉందనీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారువిద్యార్థులు వారి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాలను ఉపయోగించి వ్యక్తిగత పురోగతినీవిజయాన్నీ పొందడానికి మార్గదర్శకత్వం వహించడం ‘పరీక్షా పే చర్చా’ ఉద్దేశమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా -

‘‘విద్యా వితర్కో విజ్ఞానం స్మృతిస్తత్పరతా క్రియా

యస్యైతే షడ్గుణాస్తస్య నాసాధ్యమతివర్తతే’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

ఈ శ్లోకానికి.. జ్ఞానంతర్కంవిజ్ఞానంస్మృతిసమయ పాలనలతో పాటు దీక్షతో నిండి ఉండే వ్యక్తి సవాలు ఎలాంటిది అయినా విజయాన్ని సాధించగలుగుతారు.. మరి ఇలాంటి వ్యక్తికి ఏదీ అసంభవం కాదని అర్థం.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘అద్భుత ప్రతిభ సమృద్ధంగా ఉన్న మన విద్యార్థులకుతమ కలల్ని నిజం చేసుకొనే పూర్తి సామర్థ్యం ఉందివారు తమ ప్రతిభనీకౌశలాన్నీ ఎలా సార్థకంగా ఉపయోగించుకోవచ్చో మార్గదర్శకత్వాన్ని అందించడం ‘పరీక్షా పే చర్చా’ లక్ష్యం’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2225571) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam