జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

దుబాయ్ లో చిక్కుకున్న భారత వలస కార్మికుల విషయాన్ని సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల సంఘం


జార్ఖండ్ లోని మూడు జిల్లాలకు చెందిన కార్మికుల పాస్ పోర్టు స్వాధీనం..

జీతాలు ఇవ్వకుండా... భారత్ కు తిరిగి రాకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వలస కార్మికుల కంట్రోల్ రూం అధిపతికి నోటీసులు జారీ..

ఈ విషయంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని కమిషన్ ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 09 FEB 2026 3:27PM by PIB Hyderabad

జార్ఖండ్ లోని గిరిదీహజారీబాగ్బొకారో జిల్లాలకు చెందిన 14 మంది వలస కార్మికులు దుబాయ్ లో చిక్కుకుపోయినట్లు మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించిందిఈ కేసును కమిషన్ సుయోటోగా స్వీకరించిందిట్రాన్స్‌మిషన్ లైన్ పనుల్లో నిమగ్నమైన ఒక సంస్థ ఈ కార్మికులను ఉద్యోగంలో తీసుకొనివారు తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుందిఅంతేకాకుండా వారికి వేతనాలను చెల్లించడం లేదని సమాచారంఈ పరిస్థితుల నేపథ్యంలో తమను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలంటూ బాధిత కార్మికులు జార్ఖండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తా కథనంలోని విషయాలు నిజమైతే.. అవి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని కమిషన్ అభిప్రాయపడిందిదీనిపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిరాష్ట్ర వలస కార్మికుల సమాచార కేంద్రం (ఎండబ్ల్యూసీఆర్అధిపతికి నోటీసులు జారీ చేసింది.

2026 ఫిబ్రవరి ప్రచురితమైన మీడియా నివేదిక ప్రకారం.. భారత్ నుంచి దుబాయ్‌కు విమాన టిక్కెట్ల కోసం అయిన ఖర్చును వసూలు చేసేందుకు సంబంధిత కంపెనీ కార్మికుల జీతంలో ఎక్కువ భాగం కోత విధించిందని అక్కడ చిక్కుకున్న ఒక కార్మికుడు ఫోన్ ద్వారా సమాచారం అందించారువసతికి కూడా సంస్థ డబ్బులు వసూలు చేస్తోందనిచివరకు ఆహారం కొనుక్కోవడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని వారు ఫిర్యాదు చేశారు

 

***


(రిలీజ్ ఐడి: 2225535) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी