ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షులతో పాటు దేశానికి సేవ చేయడానికి ఆశీస్సులు కోరుకుంటూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2026 9:32AM by PIB Hyderabad

భారత్ శాశ్వత నాగరికతా జ్ఞ‌ానాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ ఆరోగ్యం, దీర్ఘాయుష్షులతో పాటు సేవలను అందించాలన్నదే దేశ ప్రజల సామూహిక ఆకాంక్ష అని చాటిచెప్తున్న ఒక ప్రార్థన శ్లోకాన్ని ఉదాహరించారు.
ఈ ప్రార్థన భారత సాంస్కృతిక వారసత్వ భావనను చాటి చెబుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీన్లో భూమి పట్ల ఆరాధన, సంక్షేమం పట్ల నిబద్ధతలతో పాటు, సేవ చేయడానికి అంకితం కావడం అనే అంశాలు దేశ ప్రగతికి పునాదులుగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఈ కింది సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించారు:
‘‘ఉపస్థాస్తే అనమీవా అయక్ష్మా అస్మభ్యం సన్తు పృథివి ప్రసూతా:
దీర్ఘం న ఆయు: ప్రతిబుధ్యమానా వయం తుభ్యం బలిహృత: స్యామ్’’.


(రిలీజ్ ఐడి: 2224771) సందర్శకుల సూచీ సంఖ్య : : 17