ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంపిక చేసిన యాక్సిలరేటర్ల ద్వారా 373 అంకురాలకు ఆర్థిక సహకారం అందించిన సమ్రిద్ కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 2:35PM by PIB Hyderabad

వైద్యారోగ్య సాంకేతికత, విద్యా సాంకేతికత, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక సాంకేతికత, సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ యాజ్ సర్వీస్), సుస్థిరత వంటి కీలక రంగాల్లో సుమారు 300 అంకురాలను ప్రోత్సహించాలని సమ్రిద్ కార్యక్రమం(ది స్టార్టప్ యాక్సలేటర్ ఆఫ్ మైటీ ఫర్ ప్రాడక్ట్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్, గ్రోత్) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం కింద 186 యాక్సిలరేటర్లు ఆసక్తిని కనబరచగా.. 16 రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమమైన 43 యాక్సిలరేటర్లను ఎంపిక చేశారు. 

ఎంపికైన యాక్సిలరేటర్ల పనితీరును వాటి కార్యక్రమ ప్రమాణాల (నాణ్యతతో పాటు పరిమాణం) ఆధారంగా.. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) పరిధిలోని మైటీ (ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ) అంకుర హబ్ (ఎంఎస్‌హెచ్) పర్యవేక్షిస్తూ అంచనా వేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మద్దతు పొందుతున్న అంకురాల వార్షిక ఆదాయం, మార్కెట్ విలువలో పెరుగుదలను కూడా నిరంతరం పరిశీలిస్తోంది.

సమ్రిద్ కార్యక్రమం మార్గదర్శకాల ప్రకారం ఎంపికైన యాక్సిలరేటర్లకు ఒక్కో అంకురానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. అంకురాలు గరిష్ఠంగా రూ. 40 లక్షల వరకు మ్యాచింగ్ నిధులను పొందుతాయి. ఇప్పటివరకు ఎంపికై శిక్షణ పొందిన 373 అంకురాల్లో 241 అంకురాలు ఈ మ్యాచింగ్ నిధులను ఎంపికయ్యాయి. గత ఐదేళ్లలో యాక్సిలరేటర్ల వారీగా మార్గదర్శకత్వం పొందిన అంకురాలు, నిధులు, నిధుల పంపిణీ సమాచారం అనుబంధం-Iలో ఉంది.

అనుబంధం- I

వరుస నం.

రాష్ట్రం

ఈఓఐ సమర్పించిన యాక్సిలరేటర్ల సంఖ్య

ఎంపికైన యాక్సిలరేటర్ల సంఖ్య

మార్గదర్శత్వం పొందిన అంకురాల సంఖ్య

నిధులు అందుకున్న అంకురాల సంఖ్య

పొందిన నిధులు

రూ. కోట్లలో

1

ఆంధ్రప్రదేశ్

7

1

5

5

1.81

2

అస్సాం

3

0

-

-

-

3

బీహార్

5

0

-

-

-

4

చత్తీస్‌గఢ్

3

0

-

-

-

5

ఢిల్లీ

13

2

31

28

11.42

6

గోవా

3

1

14

6

2.37

7

గుజరాత్

12

2

13

6

2.36

8

హర్యానా

6

3

28

20

7.54

9

హిమాచల్ ప్రదేశ్

2

0

-

-

-

10

జమ్మూ & కాశ్మీర్

1

0

-

-

-

11

కర్ణాటక

25

8

69

40

15.77

12

కేరళ

5

2

21

13

4.95

13

మధ్యప్రదేశ్

3

1

6

5

1.72

14

మహారాష్ట్ర

20

4

26

12

5.14

15

ఒడిశా

3

1

16

13

5.07

16

పంజాబ్

5

0

-

-

-

17

రాజస్థాన్

13

3

19

17

5.68

18

సిక్కిం

1

1

6

1

0.52

19

తమిళనాడు

18

3

35

25

9.75

20

తెలంగాణ

22

5

34

17

7.23

21

ఉత్తర ప్రదేశ్

10

4

35

27

9.91

22

ఉత్తరాఖండ్

4

0

-

-

-

23

పశ్చిమ బెంగాల్

2

2

15

6

2.5


 

ఈ సమాచారాన్ని 04.02.2026న లోక్‌సభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద అందించారు. 

 

****


(రిలీజ్ ఐడి: 2223813) సందర్శకుల సూచీ సంఖ్య : : 86
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi