ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికాస్ భీ, విరాసత్ భీ’ అనే మంత్రాన్ని స్వీకరించడం వల్ల త్రిపుర రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి సాధించిందో వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
03 FEB 2026 2:15PM by PIB Hyderabad
‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి, వారసత్వం) అనే మంత్రాన్ని స్వీకరించడం వల్ల త్రిపుర ఎంత వేగంగా అభివృద్ధిని సాధించిందో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా తన ఇటీవలి త్రిపుర పర్యటన అనుభవాలను పంచుకుంటూ.. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులను, అక్కడి అపార అవకాశాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరించారు. ఈ పోస్టుకు ప్రధానమంత్రి స్పందించారు. త్రిపుర కేవలం మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిలోనే కాకుండా, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవడంలో, వేడుకగా జరుపుకోవడంలో కూడా ముందంజలో ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ లో ఇలా పేర్కొన్నారు:
“వికాస్ భీ, విరాసత్ భీ’ అనే మంత్రాన్ని పుణికిపుచ్చుకున్న త్రిపుర అభివృద్ధిలో వేగవంతమైన పురోగతిని సాధిస్తోంది. ప్రతిరోజూ కొత్త విజయాలను నమోదు చేస్తుంది. కేంద్రమంత్రి @JM_Scindia గారు తన త్రిపుర పర్యటన అనుభవాలను పంచుకుంటూ.. రాష్ట్రం మారుతున్న తీరును, అక్కడి అపార అవకాశాలను గురించి వివరంగా తెలియజేశారు. ఆయన రాసిన ఈ కథనాన్ని చదవండి’’
(రిలీజ్ ఐడి: 2222580)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam