ప్రధాన మంత్రి కార్యాలయం
హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని... పంజాబ్ ప్రజలకు.. ముఖ్యంగా లూధియానా, పరిసర ప్రాంత వాసులకు ఇది సంతోషదాయక క్షణమని వ్యాఖ్య
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 7:18PM by PIB Hyderabad
హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం పంజాబ్ ప్రజలకూ.. ముఖ్యంగా లూథియానా, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యంత సంతోషదాయకమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర భారతదేశంలో లూథియానా ఒక కీలక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రమని, ఈ నగరానికి వైమానిక అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఆధునిక విమానాశ్రయం కోసం జరుగుతున్న పనులు ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం పంజాబ్ ప్రజలకూ.. ముఖ్యంగా లూధియానా, పరిసర ప్రాంత వాసులకు ఎంతో సంతోషాన్ని కలిగించే క్షణం. మనందరికీ తెలుసు.. లూధియానా ఉత్తర భారతదేశంలో కీలక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. ఈ నగర ప్రజలు చైతన్యవంతులు. ఈ నగరానికి వైమానిక అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఆధునిక విమానాశ్రయం కోసం జరుగుతున్న పనులు ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయి.’’
"ਹਲਵਾਰਾ ਹਵਾਈ ਅੱਡੇ 'ਤੇ ਟਰਮੀਨਲ ਇਮਾਰਤ ਦਾ ਉਦਘਾਟਨ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ, ਖ਼ਾਸ ਕਰਕੇ ਲੁਧਿਆਣਾ ਅਤੇ ਨਜ਼ਦੀਕੀ ਇਲਾਕਿਆਂ ਲਈ ਬੇਹੱਦ ਖ਼ੁਸ਼ੀ ਦਾ ਮੌਕਾ ਹੈ। ਜਿਵੇਂ ਕਿ ਅਸੀਂ ਸਾਰੇ ਜਾਣਦੇ ਹਾਂ, ਲੁਧਿਆਣਾ ਉੱਤਰੀ ਭਾਰਤ ਦਾ ਅਹਿਮ ਸਨਅਤੀ ਅਤੇ ਵਪਾਰਕ ਕੇਂਦਰ ਹੈ। ਇਹ ਸ਼ਹਿਰ ਆਪਣੇ ਉੱਦਮੀ ਲੋਕਾਂ ਕਰਕੇ ਜਾਣਿਆ ਜਾਂਦਾ ਹੈ। ਸਾਡੀ ਸਰਕਾਰ ਇਸ ਸ਼ਹਿਰ ਦਾ ਹਵਾਈ ਸੰਪਰਕ ਬਿਹਤਰ ਬਣਾਉਣ ਲਈ ਅਣਥੱਕ ਮਿਹਨਤ ਕਰ ਰਹੀ ਹੈ, ਜੋ ਆਧੁਨਿਕ ਹਵਾਈ ਅੱਡੇ ਲਈ ਚੱਲ ਰਹੇ ਕੰਮਾਂ ਵਿੱਚ ਸਾਫ਼ ਝਲਕਦੀ ਹੈ।"
(రిలీజ్ ఐడి: 2222108)
సందర్శకుల సూచీ సంఖ్య : : 61
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam