ప్రధాన మంత్రి కార్యాలయం
ఆదంపూర్ విమానాశ్రయానికి శ్రీ గురు రవిదాస్ మహరాజ్ జీ పేరు పెట్టడం ఆ మహనీయుని కాలాతీత ఆదర్శాలకు తగిన నివాళి: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 6:21PM by PIB Hyderabad
ఈ రోజు సంత్ రవిదాస్ జయంతి శుభ సందర్భంలో ఆదంపూర్ విమానాశ్రయాన్ని శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పిలవాలని నిర్ణయించడం ఎంతో గౌరవం, గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ కాలాతీత ఆదర్శాలకు ఇది సముచిత నివాళి అవుతుందన్న శ్రీ మోదీ... సమానత్వం, కరుణ, సేవలను బోధించిన ఆయన సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈ రోజు సంత్ రవిదాస్ జయంతి శుభ సందర్భంలో ఇకమీదట ఆదంపూర్ విమానాశ్రయాన్ని శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పిలవాలని నిర్ణయించడం చాలా గౌరవంగా, గర్వంగా ఉంది. ఇది మనందరికీ సంతోషకరమైన రోజు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ కాలాతీత ఆదర్శాలకు ఇది సముచితమైన నివాళి. సమానత్వం, కరుణ, సేవలతో కూడిన ఆయన సందేశం మనందరికీ గొప్ప స్ఫూర్తిని అందిస్తూ ఉంటుంది."
***
(రిలీజ్ ఐడి: 2221926)
సందర్శకుల సూచీ సంఖ్య : : 83
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam