ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీ స్మృతి వద్ద ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2026 8:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గాంధీ స్మృతి వద్ద ఇవాళ జరిగిన ప్రార్థనా సమావేశానికి హాజరయ్యారు. మన స్వాతంత్ర్య పోరాట గమనాన్ని బాపు కృషి మార్చేసిందని, భారతదేశ ప్రస్థానంపై ఆయన చెరగని ముద్ర వేశారని, అది తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"గాంధీ స్మృతి వద్ద ప్రార్థనా సమావేశానికి హాజరయ్యాను.
బాపు జీవితం మిలియన్ల మందిలో ఆశను నింపుతుంది. ఆయన కృషి మన స్వాతంత్య్ర గమనాన్ని మార్చటమే కాక, భారతదేశ ప్రయాణంలో ఆయన వేసిన చెరగని ముద్ర తరతరాలకు స్ఫూర్తి".
(रिलीज़ आईडी: 2221056)
आगंतुक पटल : 6