రక్షణ మంత్రిత్వ శాఖ
రిపబ్లిక్ డే పరేడ్ 2026లో ఉత్తమ మార్చింగ్ బృందాలు, ఉత్తమ శకటాలకు అవార్డులు ప్రదానం చేసిన రక్షణ శాఖ సహాయమంత్రి
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనే దేశ సంకల్పాన్ని స్పష్టం చేసిన జనవరి 26 వేడుకలు: శ్రీ సంజయ్ సేథ్
प्रविष्टि तिथि:
30 JAN 2026 4:58PM by PIB Hyderabad
రిపబ్లిక్ డే పరేడ్-2026లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన త్రివిధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఇతర దళాలకు చెందిన బృందాలకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉత్తమ శకటాలకు రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ సేథ్ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే పరేడ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విజేతలను రక్షణ శాఖ సహాయమంత్రి అభినందించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్-2047 సాధన సంకల్పాన్ని జనవరి 26 వేడుకలు స్పష్టం చేశాయన్నారు. పీఎం ఎన్‌సీసీ ర్యాలీ 2026లో యువతకు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును ఆయన గుర్తు చేశారు. వారానికి ఒక గంట సమయాన్ని యువత స్వచ్ఛతా కార్యక్రమాల కోసం కేటాయించాలని, ఏదైనా ప్రదేశంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన బృందాలు, శకటాలను ముగ్గురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేసింది.
· త్రివిధ దళ ఉత్తమ మార్చింగ్ బృందం- భారత నేవీ
· సీఏపీఎఫ్‌లు, ఇతర సహాయక దళ ఉత్తమ బృందం- ఢిల్లీ పోలీసు
· ఉత్తమ మూడు శకటాలు (రాష్ట్రాలు, యూటీలు):
1. మహారాష్ట్ర (గణేశ్ ఉత్సవ్: ఆత్మనిర్భరతకు చిహ్నం)
2. జమ్మూ, కాశ్మీర్ (జమ్మూకాశ్మీర్‌కు చెందిన హస్తకళలు, జానపద నృత్యాలు)
3. కేరళ (వాటర్ మెట్రో, 100% డిజిటల్ అక్షరాస్యత: ఆత్మనిర్భర్ భారత్ కోసం ఆత్మనిర్భర్ కేరళ)
· కేంద్ర మంత్రిత్వ శాఖ, విభాగ ఉత్తమ శకటం - సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (వందేమాతరం-దేశ ఆత్మ రోదన)
· ప్రత్యేక బహుమతి:
1. కేంద్ర ప్రభుత్వ ప్రజా పనుల విభాగం (వందేమాతరం- 150 ఏళ్ల వేడుకలు)
2. 'వందేమాతరం: భారత శాశ్వత ప‌్రతిధ్వని' నృత్య బృందం
మైగవ్ పోర్టల్‌లో ప్రజలు ఓటు వేసిన 'పాపులర్ ఛాయిస్' విభాగం విజేతలైన మార్చింగ్ బృందాలు, శకటాల విభాగం వివరాలు:
· త్రివిధ దళ ఉత్తమ మార్చింగ్ బృందం- అస్సాం రెజిమెంట్
· సీఏపీఎఫ్‌లు, ఇతర సహాయక దళ ఉత్తమ బృందం- సీఆర్‌పీఎఫ్
· ఉత్తమ మూడు శకటాలు (రాష్ట్రాలు, యూటీలు):
1. గుజరాత్ (స్వదేశీ మంత్ర – స్వావలంబన – స్వేచ్ఛ: వందేమాతరం)
2. ఉత్తరప్రదేశ్ (బుందేల్‌ఖండ్ సంస్కృతి)
3. రాజస్థాన్ (ఎడారిలో బంగారు స్పర్శ: బికనీర్ గోల్డ్ ఆర్ట్ (ఉస్తా కళ))
· కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగ ఉత్తమ శకటం - పాఠశాల విద్య, అక్షరాస‌్యత శాఖ (జాతీయ విద్యా విధానం 2020: వికసిత్ భారత్ దిశగా భారతీయ పాఠశాల విద్య జైత్రయాత్ర)
***
(रिलीज़ आईडी: 2221054)
आगंतुक पटल : 6