ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 28 JAN 2026 7:18PM by PIB Hyderabad

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రులు రామ్మోహన్ నాయుడుమురళీధర్ మొహోల్ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చిన గౌరవ మంత్రులకుఅంతర్జాతీయ విమానయాన పరిశ్రమ దిగ్గజాలకుఅంతర్జాతీయ సంస్థల ప్రతినిధులువిశిష్ట అతిథులుసోదరీసోదరులారా!

నమస్కారం!

పారిశ్రామిక నాయకులునిపుణులుపెట్టుబడిదారులు అందరినీ వింగ్స్ ఇండియాకు సాదరంగా ఆహ్వానిస్తున్నానువైమానిక రంగ భవిష్యత్తు అనేక ఆకాంక్షలతో నిండి ఉందని మీ అందరికీ తెలుసుదీనిలో భారత్ కీలకంగా మారనుందివిమానాల తయారీపైలట్ శిక్షణఅధునాతన విమాన ప్రయాణంఎయిర్‌క్రాఫ్టుల లీజు ఈ రంగాల్లో అనేక అవకాశాలు భారత్‌లో ఉన్నాయిఅందుకే వింగ్స్ ఇండియా సదస్సు మనందరికీ ముఖ్యమైనదిగా మారింది.

స్నేహితులారా

మొత్తం భారతీయ విమానయాన రంగంలో గత దశాబ్దంలో చరిత్రాత్మక పరివర్తన చోటు చేసుకుందివిమాన ప్రయాణం కొందరికి మాత్రమే పరిమితమైన దేశాల్లో ఒకప్పుడు భారత్ కూడా ఉండేదికానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందిఈ రోజుప్రపంచంలోనే మూడో అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా భారత్ ఎదిగిందిమా ప్రయాణికుల రద్దీ వేగంగా పెరిగిందిభారతీయ వైమానిక సంస్థల విమానాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందిఇటీవలి సంవత్సరాల్లో.. 1500కు పైగా విమానాలకు భారతీయ విమానయాన సంస్థలు ఆర్డర్లు ఇచ్చాయి.

స్నేహితులారా,

దీర్ఘకాలిక లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తున్నందువల్లే భారత విమానయాన రంగంలో ఈ మార్పు వచ్చిందిఇప్పుడు భారత్‌లో విమాన ప్రయాణంకొందరికే పరిమితం కాకుండా.. సమ్మిళిత్వంతో నిండి ఉందిభారతీయ పౌరునికి విమాన ప్రయాణ సౌలభ్యం అందించడమే మా లక్ష్యంఅందుకే ద్వితీయతృతీయ శ్రేణి నగరాలను విమానశ్రయాలతో అనుసంధానించాం. 2014లో భారత్‌లో 70 ఎయిర్పోర్టులు ఉండేవిఇప్పుడు ఈ సంఖ్య 160కి పెరిగిందిఒక దశాబ్ద కాల వ్యవధిలోనే భారత్‌లో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగిందిదేశంలో వంద కంటే ఎక్కువ ఎయిర్ డోమ్‌లను ప్రారంభించాంవీటితో పాటుగా మా ప్రజల కోసం సరసమైన ధరలతో ఉడాన్ పథకాన్ని ప్రారంభించాంఈ పథకం ద్వారా కోటిన్నర మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో ప్రయాణించారుఈ మార్గాల్లో చాలా వరకు గతంలో ఉనికిలో లేవు.

స్నేహితులారా,

ఈ రోజుఅభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ ముందుకెళుతోందిఈ నేపథ్యంలో మన విమానయాన కార్యకలాపాలు అనేక రెట్లు పెరగడం ఖాయంభారత్‌లో వైమానిక వ్యవస్థ విస్తరించేలా 2047 నాటికి మరో నాలుగు వందల విమానాశ్రయాలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారుఇదే కాకుండా.. ఉడాన్ పథకం తదుపరి దశపై కూడా మా ప్రభుత్వం పనిచేస్తోందిఈ విధానంతో ప్రాంతీయంగాచౌక ధరలకే లభించే విమానయానం మరింత బలపేతమవుతుందివీటితో పాటుగా.. సీప్లేన్ కార్యకలాపాలు సైతం మరింత విస్తరిస్తాయిభారత్‌లోని ప్రతి మూలకు వైమానిక ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలన్నదే మా ప్రయత్నం.

స్నేహితులారా,

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై కూడా భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందిదేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి అవుతున్నాయిఈ ప్రాంతాలకు చేరుకొనేందుకు ఎక్కువ మంది ప్రజలకు విమాన ప్రయాణమే మొదటి ఎంపికగా ఉంటోందిభవిష్యత్తులో మునుపెన్నడూ లేని విధంగా విమాన ప్రయాణానికి గిరాకీ విస్తరించనుందిఅంటే మీ అందరికీ మరిన్ని పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి.

స్నేహితులారా,

ప్రస్తుతం ప్రధాన అంతర్జాతీయ వైమానిక కేంద్రంగా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో.. మన విమానయాన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం అవసరంఅందుకే మనం స్వావలంబన మార్గాన్ని బలోపేతం చేసుకోవాలిభారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు ఇది సహాయపడుతుందిఈ ఆలోచనతోనేఎయిర్‌క్రాఫ్టు నమూనాఎయిర్‌క్రాఫ్టు తయారీఎయిర్‌క్రాఫ్టు ఎంఆర్‌వో వ్యవస్థపై భారత్ ప్రధాన దృష్టిని సారిస్తోందిఎయిర్‌క్రాఫ్టు విడి భాగాల ప్రధాన తయారీదారుగాసరఫరాదారుగా భారతదేశం నేటికీ కొనసాగుతోందిదేశంలో సైనికరవాణా విమానాల తయారీని మేం ప్రారంభించాంపౌర విమానాల తయారీ దిశగా సైతం భారత్ ముందుకెళుతోందిభారత్‌లో అనేక ప్రయోజనాలున్నాయని పెట్టుబడిదారులైన మీ అందరికీ తెలుసుప్రపంచ ఎయిర్ కారిడార్లలో భౌగోళిక స్థానంఅసమానమైన దేశీయ ఫీడర్ నెట్వర్క్భవిష్యత్తులో దూర ప్రాంతాలకు ప్రయాణించే విమానాల సంఖ్య పెంపు.. ఇవన్నీ భారతదేశానికున్న ప్రధాన బలాలు.

స్నేహితులారా,

భారత్‌లో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్లాండింగ్ ఎయిర్ క్రాఫ్టును రూపొందించితయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదుఇది మొత్తం విమానయాన రంగానికి కొత్త దిశను అందిస్తుందిఈ సాంకేతికత ప్రయాణ సమయాన్ని చాలా తగ్గిస్తుందిదీనితో పాటుగాపర్యావరణహిత విమాన ఇంధనంపై కూడా మేం పని చేస్తున్నాంవచ్చే కొన్నేళ్లలో హరిత వైమానిక ఇంధన ప్రధాన ఉత్పత్తిదారుగాఎగుమతిదారుగా మారే దిశలో భారత్ ముందుకెళుతోంది.

స్నేహితులారా,

దేశీయ విమానయాన రంగంలో అనేక సంస్కరణలను సైతం మేం చేపడుతున్నాంఈ ప్రయత్నాల వల్లగ్లోబల్ సౌత్‌కుప్రపంచానికి మధ్య ప్రధాన విమానయాన ద్వారంగా భారత్ మారనుందిఇది విమానయాన రంగంతో అనుసంధానమై ఉన్న పెట్టుబడిదారులకుతయారీదారులకు మంచి అవకాశం.

స్నేహితులారా,

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుమార్కెట్లను ఒకదానితో ఒకటి భారత్ ప్రస్తుతం అనుసంధానిస్తోందిమన నగరాలను వివిధ రకాల రవాణా మార్గాల ద్వారా పోర్టులకు అనుసంధానించాంఎయిర్ కార్గోకు సైతం భారత విమానయాన రంగం సమ ప్రాధాన్యమిస్తోందికార్గో రవాణాను మరింత వేగవంతంగాసమర్థంగా మార్చేందుకు అవసరమైన అన్ని నియంత్రణ సంస్కరణలపై ప్రభుత్వం పనిచేస్తోందివీటితో పాటుగా.. మన డిజిటిల్ కార్గో వేదికలు సైతం ఈ మొత్తం ప్రక్రియను సరళంగాపారదర్శకంగా మారుస్తున్నాయిఆఫ్-ఎయిర్పోర్టు ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్పోర్టులపై భారం కూడా తగ్గుతోందికార్గో నిర్వహణను మరింత వేగంగామెరుగ్గా చేపట్టేందుకు ఆధునిక గిడ్డంగులను సైతం మేం నిర్మిస్తున్నాంభవిష్యత్తులో కార్గో డెలివరీ సమయంరవాణా ఖర్చులను ఇది తగ్గిస్తుందిఅలాగే భవిష్యత్తులో అతి పెద్దపోటీనిచ్చే సరకు రవాణా హబ్‌గా భారత్ ఆవిర్భవిస్తుంది.

స్నేహితులారా,

గిడ్డంగులుసరకు రవాణాఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్-కామర్స్ రంగాల్లో భారత్‌లో ఉన్న అవకాశాలను అన్వేషించాల్సిందిగా పెట్టుబడిదారులను కోరుతున్నాను.

స్నేహితులారా,

విమానయాన పరిశ్రమకు సంబంధించి ఇంత పెద్ద స్థాయినిస్థిరమైన విధానాలనుసాంకేతిక లక్ష్యాలను కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే ఉన్నాయిఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి దేశానికిప్రతి పారిశ్రామికవేత్తకుప్రతి ఆవిష్కర్తకు చెబుతున్నానుఈ అభివృద్ధి ప్రయాణంలో మా దీర్ఘకాలిక భాగస్వామిగా మారండిప్రపంచ విమానయాన రంగ వృద్ధికి కృషి చేయండిభారతీయ విమానయానంలో సహ పైలట్లుగా మాతో కలసి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నానుమరోసారి.. వింగ్స్ ఇండియాను విజయవంతంగా నిర్వహిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

 

****


(రిలీజ్ ఐడి: 2220044) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam