ప్రధాన మంత్రి కార్యాలయం
అజిత్ పవార్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 JAN 2026 11:16AM by PIB Hyderabad
శ్రీ అజిత్ పవార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండే కష్టపడే వ్యక్తిగా శ్రీ అజిత్ పవార్ విస్తృత గౌరవాన్ని పొందారని ప్రధాని పేర్కొన్నారు. పాలనాపరమైన విషయాలపై ఆయనకు ఉన్న అవగాహన.. పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కూడా ఎంతో గమనార్హమైనవని అన్నారు. “ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది.. విచారకరమైనది. ఆయన కుటుంబ సభ్యులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలను కలిగి ఉన్న ప్రజా నాయకుడు శ్రీ అజిత్ పవార్. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో నిలిచే కష్టపడే వ్యక్తిగా ఆయన విస్తృత గౌరవాన్ని పొందారు. పాలనాపరమైన అంశాలపై ఆయనకు ఉన్న అవగాహన.. పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది.. విచారకరమైనది. ఆయన కుటుంబ సభ్యులు, అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి."
***
(रिलीज़ आईडी: 2219495)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam