‘‘మన్ కీ బాత్’ 130వ ఎపిసోడ్‌లో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
“2026లో తొలి #మన్కీబాత్ ఎపిసోడ్ జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు జరిగింది.
ఓటరుగా నమోదు కావడాన్ని ఒక వేడుకగా జరుపుకుందాం. అన్నింటి కంటే ఓటరుగా ఉండటం గొప్ప గౌరవం, బాధ్యత.
‘‘2026 సంవత్సరాన్ని 'నాణ్యత' కోసం అంకితం చేద్దాం.
‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’ లక్ష్యాన్ని సాధించడంపై మనం దృష్టి పెడదాం.
మేడ్ ఇన్ ఇండియా అంటేనే శ్రేష్ఠతకు ప్రతీకగా నిలిచేలా మనం నిర్ధరించుకుందాం.
#మన్కీబాత్’’
‘‘ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ మీదుగా ప్రవహించే తంసా నది పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయవంతానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడి ప్రజలు తమ సమిష్టి బలం ద్వారా కేవలం ఒక నదికి మాత్రమే కాకుండా, మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ ప్రవాహానికి కూడా సరికొత్త జీవం పోశారు.
#మన్కీబాత్’’
‘‘జలవనరుల పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రజలు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను.
#మన్కీబాత్’’
‘‘మన జెన్-జీ తరం యువత భజన్ క్లబ్బింగ్ వైపు ఆకర్షితమవుతోంది ఇది భజనల పవిత్రతను కాపాడుతూ, ఆధ్యాత్మికతను, ఆధునికతను అందంగా కలిపే ప్రక్రియ.
#మన్కీబాత్’’