రైల్వే మంత్రిత్వ శాఖ
విశిష్ట సేవలందించిన ఆర్పీఎఫ్, ఆర్పీఎస్‌ఎఫ్ సిబ్బందికి రాష్ట్రపతి పతకాలు
రాష్ట్రపతి పతకానికి ఎంపికైన దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీమతి అరోమా సింగ్ ఠాకూర్
प्रविष्टि तिथि:
25 JAN 2026 2:20PM by PIB Hyderabad
రైల్వే భద్రత కోసం అంకితభావంతో పనిచేసి వృత్తిపరమైన నైపుణ్యంతో ఆదర్శప్రాయమైన కృషి చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్) అధికారులు, సిబ్బందికి 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 'రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం' (పీఎస్ఎం), 'మెరిటోరియస్ సేవా పతకం'లను (ఎంఎస్ఎం) రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకం
* శ్రీమతి అరోమా సింగ్ ఠాకూర్, ఇన్స్పెక్టర్ జనరల్, దక్షిణ మధ్య రైల్వే
విశిష్ట సేవలకు పతకం
* శ్రీ ఉత్తమ్ కుమార్ బంద్యోపాధ్యాయ, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్, దక్షిణ మధ్య రైల్వే
* శ్రీ కళ్యాణ్ డియోరి, అసిస్టెంట్ కమాండెంట్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్
* శ్రీ బల్వాన్ సింగ్, ఇన్స్పెక్టర్, ఉత్తర రైల్వే
* శ్రీ ప్రఫుల్ చంద్ర పాండా, ఇన్స్పెక్టర్, తూర్పు తీర రైల్వే
* శ్రీ ప్రకాష్ చరణ్ దాస్, ఇన్స్పెక్టర్, తూర్పు తీర రైల్వే
* శ్రీ ముఖేష్ కుమార్ సోమ్, ఇన్స్పెక్టర్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్
* శ్రీ పప్పల శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్, తూర్పు తీర రైల్వే
* శ్రీ అన్వర్ హుస్సేన్, సబ్ ఇన్స్పెక్టర్, పశ్చిమ రైల్వే
* శ్రీ శ్రీనివాస్ రావుల, సబ్ ఇన్స్పెక్టర్, దక్షిణ మధ్య రైల్వే
* శ్రీ శివ్ లహరి మీనా, సబ్ ఇన్స్పెక్టర్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్
* శ్రీ దిక్కల వెంకట మురళీ కృష్ణ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, తూర్పు తీర రైల్వే
* శ్రీ సంజీవ్ కుమార్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఉత్తర రైల్వే
* శ్రీ మహేశ్వర రెడ్డి కర్నాటి, హెడ్ కానిస్టేబుల్, దక్షిణ మధ్య రైల్వే
* శ్రీ సీ. ఇయ్య భారతి, హెడ్ కానిస్టేబుల్, దక్షిణ రైల్వే
* శ్రీ మొహమ్మద్ రఫీక్, కానిస్టేబుల్/ధోబి, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్
విశిష్టమైన సేవలను అందించిన వారికి 'రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం' (పీఎస్ఎం) అందజేస్తారు. వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ విధి పట్ల అంకితభావంతో విలువైన సేవలు అందించిన వారికి 'మెరిటోరియస్ సేవా పతకం'ను (ఎంఎస్ఎం) అందజేస్తారు.
భారతీయ రైల్వేలను మరింత సురక్షితమైనవిగా చేయటంలో అత్యున్నత సేవా ప్రమాణాలను కొనసాగించేలా ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్ఎఫ్ సిబ్బందిని గౌరవించటంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపటానికి ఈ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం (ఆర్‌డీ), స్వాతంత్ర్య దినోత్సవం (ఐడీ).. ఇలా రెండు సార్లు అందిస్తారు.
***
(रिलीज़ आईडी: 2218532)
आगंतुक पटल : 8