ప్రధాన మంత్రి కార్యాలయం
పరాక్రమ దినోత్సవం సందర్భంగా సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి.. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ధైర్య సాహసాలు, పరాక్రమం వంటి ఆదర్శాల్ని స్మరించుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
23 JAN 2026 9:00AM by PIB Hyderabad
ధైర్య సాహసాలు, పరాక్రమం.. వీటి సిసలైన అర్థాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవితం మనకు బోధిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ అజేయ సాహసం, త్యాగంతో పాటు మాతృభూమి పట్ల ఆయన కనబరిచిన తిరుగులేని నిబద్ధతను ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు గుర్తు చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
వీరత్వానికి సంబంధించిన అత్యున్నత ఆదర్శాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకుంటూ -
‘‘ఏతదేవ పరం శౌర్యం యత్ పరప్రాణరక్షణమ్
నహి ప్రాణహర: శూర: శూర: ప్రాణప్రదోऽర్థినామ్’’ అని పేర్కొన్నారు.
ఇతరుల ప్రాణాలను కాపాడడమే అత్యంత పరాక్రమం అనిపించుకొంటుంది. ప్రాణాల్ని హరించే వ్యక్తి వీరుడు కారు.. తన ప్రాణాన్ని అర్పించైనా సరే ఆపన్నుల్ని రక్షించే వ్యక్తే సిసలైన ధైర్యశాలి అని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘వీరత్వం, శౌర్యం.. వీటికి సిసలైన అర్థాల్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవనం మనకు తెలియజెబుతోంది. వీటిని పరాక్రమ్ దివస్ మనకు గుర్తుకు తీసుకు వస్తోంది.
‘‘ఏతదేవ పరం శౌర్యం యత్ పరప్రాణరక్షణమ్
నహి ప్రాణహర: శూర: శూర: ప్రాణప్రదోऽర్థినామ్.’’
(रिलीज़ आईडी: 2217936)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam