ప్రధాన మంత్రి కార్యాలయం
బాలాసాహెబ్ థాకరే శత జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2026 8:26AM by PIB Hyderabad
మహనీయుడు బాలాసాహెబ్ థాకరే శత జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మహారాష్ట్ర సామాజిక, రాజకీయ రంగాల్ని ఎంతగానో తీర్చిదిద్దిన సమున్నత వ్యక్తి బాలాసాహెబ్ థాకరే అని ప్రధానమంత్రి ఆయనను స్మరించుకున్నారు.
బాలాసాహెబ్ థాకరే కుశాగ్ర బుద్ధి, శక్తిమంతమైన వాగ్ధాటి, రాజీ పడని దృఢ విశ్వాసాలకు గాను పేరు తెచ్చుకున్నారు.. ప్రజలతో ఆయనకు అద్వితీయ అనుబంధం ఉందని ప్రధానమంత్రి అన్నారు.
రాజకీయాలకు అతీతంగా సంస్కృతం, సాహిత్యం, పత్రికా రచన.. వీటిపై ఎంతో మక్కువను బాలాసాహెబ్ థాకరే పెంచుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. సమాజాన్ని ఎంత నిశితంగా బాలాసాహెబ్ పరిశీలించారో, అనేక అంశాలపై ఎంత నిర్భయంగా ఆయన వ్యాఖ్యానించేవారో వ్యంగ్య చిత్రకారునిగా ఆయన అనుసరించిన వృత్తి జీవితం మనకు తెలియజేసిందని ప్రధానమంత్రి స్మరించుకున్నారు.
మహారాష్ట్ర పురోగతి కోసం బాలాసాహెబ్ థాకరే కన్న కలల నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందానని ప్రధానమంత్రి తెలిపారు. ఆ కలలను నెరవేర్చే దిశగా ఎల్లవేళలా కృషి చేస్తామని ఉద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘మహనీయుడు బాలాసాహెబ్ థాకరే శత జయంతి సందర్భంగా, మహారాష్ట్ర సామాజిక, రాజకీయ రంగాల్ని ఎంతగానో తీర్చిదిద్దిన సమున్నత వ్యక్తికి మనం నివాళులు అర్పిస్తున్నాం.
తన కుశాగ్ర బుద్ధి, శక్తిమంతమైన వాగ్ధాటి, రాజీపడని దృఢ విశ్వాసాలకు గాను పేరు తెచ్చుకున్న బాలాసాహెబ్ థాకరే ప్రజలతో అద్వితీయ అనుబంధాన్ని పెంచుకున్నారు. రాజకీయాలకు తోడు సంస్కృతి, సాహిత్యం, పత్రికారచనల పట్ల కూడా థాకరే ఎంతో మక్కువను కనబరిచారు. సమాజాన్ని ఆయన ఎంత లోతుగా పరిశీలించారో, వివిధ అంశాలపై ఎంత నిర్భయంగా వ్యాఖ్యానించేవారో కార్టూనిస్టుగా ఆయన అనుసరించిన వృత్తిజీవన యాత్రే మనకు తెలియజెప్పింది.
మహారాష్ట్ర పురోగతి కోసం బాలాసాహెబ్ థాకరే కన్న కలలతో మేం చాలా స్ఫూర్తిని పొందుతున్నాం.. ఆ కలల్ని నెరవేర్చడానికి ఎల్లవేళలా శ్రమిస్తాం.’’
***
(रिलीज़ आईडी: 2217935)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada