రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలోని నౌకా దళ శాస్త్ర, సాంకేతికత ప్రయోగశాలను సందర్శించిన రక్షణ రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం
प्रविष्टि तिथि:
20 JAN 2026 9:31PM by PIB Hyderabad
శ్రీ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో రక్షణ రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం 2026 జనవరి 20న విశాఖపట్నంలోని నౌకా దళ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ప్రయోగశాలను (ఎన్ఎస్‌టీఎల్)ను సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఈ పర్యటన సందర్భంగా.. ఎన్ఎస్‌టీఎల్ రూపొందించిన టార్పెడోలు (ఏఎల్‌డబ్ల్యూటీ, వరుణాస్త్ర, ఈహెచ్ డబ్ల్యూటీ), మైన్లు (ఎంఐజీఎం, పీబీజీఎం), డికాయ్ వ్యవస్థలు (ఎస్ఎఫ్‌డీ, టార్‌బస్టర్), స్మార్ట్, హెచ్ఈఏయూవీ, ఎస్‌డబ్ల్యూఏఆర్ఎం, జలాంతర్గత వ్యవస్థలు, జలాంతర్గత వాహనాలు, ఉత్పత్తులు, నీటి అడుగున పనిచేసే సంబంధిత ఆయుధ సాంకేతికతలను కమిటీ సభ్యులు పరిశీలించారు.
సముద్రంలో నౌకా స్థిరత్వం, విన్యాసాల పరీక్ష కేంద్రంలో.. ఓ చిన్న నమూనా నౌకపై నిర్వహించిన హైడ్రో-డైనమిక్ పరీక్ష ప్రత్యక్ష ప్రదర్శనను కూడా కమిటీ వీక్షించింది. భారత నావికాదళ అవసరాలకు అనుగుణంగా.. జలాంతర్గత వేదికలు, ఆయుధాలు, అనుబంధ ఉత్పత్తులు, సాంకేతికతల అభివృద్ధిలో ఎన్ఎస్‌టీఎల్ పరిశోధన- అభివృద్ధి చర్యలను ప్రతినిధి బృందం ప్రశంసించింది.
పార్లమెంటు సభ్యులు, లోకసభ సచివాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఈ ప్రతినిధి బృందానికి.. రక్షణ పరిశోధన- అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్, నౌకాదళ వ్యవస్థలు- రక్షణ సామగ్రి విభాగం డీజీ డాక్టర్ ఆర్.వి. హరప్రసాద్, ఎన్ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ స్వాగతం పలికారు.
పరిశ్రమ - విద్యాసంస్థల మధ్య పరస్పర సహకారం సహా.. ఎన్‌ఎస్‌టీఎల్‌లో జరుగుతున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల గురించి ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ కమిటీకి వివరించారు. ప్రయోగశాలకు సంబంధించి భవిష్యత్ సాంకేతిక ప్రణాళికలను కూడా ఆయన క్లుప్తంగా వివరించారు. వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ‘సముద్ర ప్రాంత పర్యవేక్షణ’, జలాంతర్గత పరిధుల్లో పర్యవేక్షణ రంగాల్లో ఎన్ఎస్‌టీఎల్ పరిశోధనలను కమిటీ అభినందించింది.
***
(रिलीज़ आईडी: 2216830)
आगंतुक पटल : 4