గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో 2026 జనవరి 21న జరిగే సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు 65వ సమావేశంలో ప్రసంగించనున్న గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్


దేశ ప్రయోజనాలకు అనుగుణంగా భూగర్భ శాస్త్ర వినియోగం - భవిష్యత్తులో చేపట్టే జియో సైంటిఫిక్ కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేసేలా 65వ సీజీపీబీ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టే వార్షిక కార్యక్రమ ఆవిష్కరణ

प्रविष्टि तिथि: 20 JAN 2026 11:09AM by PIB Hyderabad

న్యూడిల్లీ, పూసాలోని ఐసీఏఆర్‌లో ఉన్న ఏపీ షిండే సింపోజియం హాలులో 2026 జనవరి 21న సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు (సీజీపీబీ) 65వ సమావేశం జరుగుతుంది. దీనిని గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, మైనింగ్ రంగాలకు చెందిన నిపుణులను ఈ కార్యక్రమం ఒక్క చోటుకి చేరుస్తుంది. దీనిలో జియో సైంటిఫిక్ పురోగతులు, ఖనిజాల అన్వేషణ వ్యూహాలు, సమస్యలకు పరిష్కారాలు, స్వచ్ఛ ఇంధనంలో నూతన కార్యక్రమాలు, భౌగోళిక ప్రమాదాలు, సుస్థిరాభివృద్ధి గురించి చర్చిస్తారు.

గనుల మంత్రిత్వ శాఖకు చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)కు చెందిన ముఖ్యమైన వేదిక సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు (సీజీపీబీ). ఇక్కడ జీఎస్‌ఐ వార్షిక ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఎస్‌పీ) గురించి, ఒక పనిని రెండో సారి చేయాల్సిన అవసరాన్ని నివారించడం గురించి చర్చిస్తారు. జీఎస్ఐతో కలసి పనిచేయడానికి సీజీపీబీ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఖనిజ అన్వేషణ సంస్థలు, పీఎస్‌యూలు, ప్రైవేటు వ్యాపారులు తమ వినతులను సమర్పిస్తారు. సీజీపీబీ అత్యున్నత సమావేశంలో చర్చల అనంతరం వచ్చే ఏడాది చేపట్టే సర్వే-మ్యాపింగ్, అన్వేషణ, పరిశోధనాభివృద్ధి, బహుళ రంగాల్లో విస్తరించిన సామాజిక ప్రాజెక్టులు, శిక్షణ-సామర్థ్య నిర్మాణం కోసం జీఎస్ఐ వార్షిక కార్యక్రమాలను వివరణాత్మక చర్చల అనంతరం ఖరారు చేస్తారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యాలకు అనుగుణంగా.. సభ్యులు, భాగస్వాములు సమర్పించిన ప్రతిపాదనల ప్రాముఖ్యం, వాటి తక్షణావసరం ఆధారంగా ఈ ప్రక్రియను చేపడతారు.

గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన 65వ సీజీపీబీ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జీఎస్ఐ డైరెక్టర్ జనలర్ శ్రీ అసిత్ సాహా, గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా ముఖ్య అతిథులుగా హాజరవుతారు. గనుల మంత్రిత్వ శాఖ. జీఎస్ఐ. రాష్ట్ర భూగర్భ విభాగాలు, పీఎస్‌యూలు, ప్రైవేటు అన్వేషణ/మైనింగ్ సంస్థలు పాల్గొంటాయి.

దిగువ పేర్కొన్న వాటితో సహా దేశ ఖనిజ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై ఈ చర్చల్లో దృష్టి సారిస్తారు.

·   ఇంధన పరివర్తన, ఆత్మనిర్భర భారత్‌కు సంబంధించిన దేశ ప్రయోజనాలకు అనుగుణంగాలిథియం, ఆర్‌ఈఈలు, గ్రాఫైట్, పీజీఈ, వనాడియం, స్కాండియం, సీసియం తదితర కీలక ఖనిజాల అన్వేషణ.

·   ఏఐ/ఎంఎల్ ఆధారిత డేటా ఏకీకరణ, జియోఫిజికల్ సర్వేలు, హైపర్ స్పెక్ట్రల్ రిమోట్ సెన్సింగ్, డీప్ డ్రిల్లింగ్, ఖనిజ వ్యవస్థల అధ్యయనాలు తదితరమైన ఆధునిక అన్వేషణ యంత్రాలను ఉపయోగించడం.

·   జాతీయ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి, చేసిన పనిని మళ్లీ చేయడాన్ని తగ్గించడానికి, అన్వేషణ నుంచి వేలానికి బ్లాకులను సిద్ధం చేయడం వరకు పనిని వేగవంతం చేయడానికి.. ముఖ్యంగా కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల విషయంలో ముందస్తు సమాచార భాగస్వామ్యం, సహకారాత్మక అన్వేషణ విధానాలు

·   విపత్తు ముప్పును తగ్గించడానికి ప్రధానంగా హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న జోన్ల గుర్తింపు, వాలు స్థిరత్వ అధ్యయనాలు.

ఈ సమావేశంలో ఎఫ్ఎస్ 2026-27 కోసం జీఎస్ఐ వార్షిక కార్యక్రమాన్ని ప్రవేశపెడతారు. దీనిలో ఖనిజాన్వేషణపై ప్రధాన దృష్టి సారిస్తూ భూ విజ్ఞాన శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన, నిశితంగా సమీక్షించిన 1,068 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణ, స్థిరత్వ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది. అలాగే కీలక ఖనిజాలు, కార్బన్ సీక్వెస్ట్రేషన్ అధ్యయనాలు, తీరప్రాంత అన్వేషణ, ప్రజా ప్రయోజనాన్ని అందించే భూవిజ్ఞాన శాస్త్రాలపై విస్తృత దృష్టిని సారిస్తుంది. ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ముఖ్యమైన ప్రచురణలను విశిష్ట అతిథులు ఆవిష్కరిస్తారు. అలాగే వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాల అన్వేషణ రంగంలో జీఎస్ఐ చేపడుతున్న కార్యకలాపాలను వివరించే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు.

అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ భౌగోళిక ప్రాధాన్యాలను నిర్దేశిస్తూ.. ఆవిష్కరణలు, వనరుల భద్రతతో భారతదేశ దార్శనికతను ముందుకు తీసుకెళ్లే సహకారాత్మకమైన, సమన్వయ వేదికగా సీజీపీబీ సమావేశం పని చేస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2216449) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil