ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్ల విలువైన అనేక రైలు, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 JAN 2026 5:07PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ దిశగా ఓ కీలక అడుగు పడింది.
వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించడం అనేది ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం దిశగా పడిన ప్రధాన ముందడుగు.’’
‘‘పశ్చిమ బెంగాల్‌కు మరో నాలుగు ఆధునిక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు లభించినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు.’’
‘‘మాల్దా రైల్వే స్టేషన్‌లో, హౌరాను గౌహతితో అనుసంధానించే తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించాను. స్టేషన్‌లో, రైలులో ఉన్న పిల్లలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిపాను.
(रिलीज़ आईडी: 2215721)
आगंतुक पटल : 6