కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికమ్యూనికేషన్స్ సహకారం విషయంలో ఉమ్మడి ఉద్దేశ్య ప్రకటనపై (జేడీఐ)


సంతకాలు చేసిన భారత్, జర్మనీ

భారత ప్రధాని, జర్మనీ ఛాన్స్‌లర్ మధ్య జరిగిన చర్చలు సాధించిన కీలక ఫలితాల్లో ఒకటిగా నిలిచిన జేడీఐ

పెరుగుతున్న భారత్-జర్మనీ సంబంధాలతో పాటు నిరంతర ఉన్నత స్థాయి చర్చల పురోగతి ఆధారంగా పనిచేయనున్న జేడీఐ

వర్థమాన డిజిటల్ సాంకేతికతలలో ఉమ్మడి సహకారానికి మార్గం సుగమం చేయనున్న ప్రకటన ఒప్పందం

టెలికాం, ఐసీటీ రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తోడ్పడనున్న భారత్-జర్మనీ ఒప్పందం

విధానపరమైన- చట్టపరమైన విధానాల తయారీ, టెలికమ్యూనికేషన్స్ - ఐసీటీ రంగాలలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం వంటి అంశాల్లో ఉమ్మడి కృషికి అవకాశం కల్పిస్తోన్న జేడీఐ

ఉమ్మడి అవగాహనను పెంపొందించడానికి అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా కలిసి పనిచేయనున్న రెండు దేశాలు

प्रविष्टि तिथि: 16 JAN 2026 1:44PM by PIB Hyderabad

2026 జనవరి 12-13 తేదీలలో భారత్‌లో జర్మనీ ఛాన్స్‌లర్ శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్ చేపట్టిన అధికారిక పర్యటన సందర్భంగా టెలికమ్యూనికేషన్స్ సహకారంపై ఇరు దేశాలు ఒక ఉమ్మడి ఉద్దేశ్య ప్రకటనపై (జేడీఐసంతకాలు చేశాయిభారత ప్రభుత్వం తరపున టెలికాం సెక్రటరీ శ్రీ అమిత్ అగర్వాల్జర్మనీ ప్రభుత్వం తరపున భారత్‌‌లోని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు.

భారత ప్రధానిజర్మనీ ఛాన్స్‌లర్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా వెలువడిన అత్యంత కీలక అంశాల్లో జేడీఐ ఒకటిగా ఉందిభారత ప్రభుత్వపు టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ), జర్మనీ ప్రభుత్వపు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్గవర్నమెంట్ మోడర్నైజేషన్ మంత్రిత్వ శాఖ (బీఎండీఎస్మధ్య ఈ ప్రకటన ఒప్పందం కుదిరింది.

భారత్-జర్మనీ సంబంధాల్లో ఉన్న పురోగతినిరంతర ఉన్నత స్థాయి చర్చల ఆధారంగా టెలికమ్యూనికేషన్స్ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సాంకేతికత (ఐసీటీరంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ ఉమ్మడి ప్రకటన ప్రతిబింబిస్తోంది

ప్రభుత్వంపరిశ్రమలువిద్యా సంస్థలుపరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో కూడిన ప్రత్యేక వర్కింగ్ గ్రూపుల మద్దతుతో క్రమబద్ధమైన సంప్రదింపులుఉన్నత స్థాయి వార్షిక సమావేశాల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఈ జేడీఏ ఏర్పాటు చేస్తుందిఈ చర్చలు నిర్మాణాత్మకఫలితాల ఆధారిత సహకారాన్ని నిర్ధారించడంలో సహాయపడతాయి.

ఈ జేడీఐలో భాగంగా సమాచారంఉత్తమ పద్ధతుల నిరంతర మార్పిడివర్ధమానభవిష్యత్తు సాంకేతికతలలో సహకారాన్ని ప్రోత్సహించడంవిధానపరమైన నిబంధనలుతయారీవ్యాపార సౌలభ్యం వంటి రంగాలలో ఉమ్మడి కృషిని పెంపొందించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి

ఉభయ పక్షాల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరస్పర ఆసక్తి ఉన్న నిర్దిష్ట లక్ష్యాలను వివరించే ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్న ఆకాంక్షను రెండు దేశాలు వ్యక్తం చేశాయిటెలికమ్యూనికేషన్స్ డిజిటల్ అభివృద్ధిపై ఉమ్మడి దృక్పథాన్ని పెంపొందించడానికిపరస్పర అవగాహనను పెంపొందించడానికి సంబంధిత అంతర్జాతీయ వేదికలలో కలిసి పనిచేయడానికి కూడా ఇరు దేశాలు సుముఖతను వ్యక్తం చేశాయి.

ఈ ఉమ్మడి ఉద్దేశ్య ప్రకటనపై సంతకాలు చేయడం అనేది టెలికమ్యూనికేషన్స్ఐసీటీ రంగాలలో భారత్-జర్మనీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన అడుగుఇది అందరికీ లబ్ధి చేకూర్చేసుస్థిరమైన డిజిటల్ పరివర్తన అనే ఉమ్మడి లక్ష్యానికి బలమైన మద్దతును ఇస్తుంది.

మరిన్ని వివరాలకు డీఓటీని అనుసరించండి

ఎక్స్ https://x.com/DoT_India

ఇన్‌స్టాగ్రాంhttps://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఫేస్‌బుక్ https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa


(रिलीज़ आईडी: 2215492) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil