ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ దేశాలతో భారత్‌ తన పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపే ఓ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 JAN 2026 1:58PM by PIB Hyderabad

కామన్వెల్త్ దేశాలతో భారత్‌ తన పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపే ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

భారత్ వేదికగా జరుగుతున్న 28వ కామన్వెల్త్ దేశాల స్పీకర్లుఅధ్యక్షత వహించే అధికారుల సమావేశం (సీఎస్‌పీఓసీసందర్భంగా లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మాట్లాడుతూ.. ‘‘వసుధైక కుటుంబం’’ (ప్రపంచమంతా ఒకే కుటుంబంఅనే భారతీయ సనాతన ధర్మానికి దేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

లోక్‌సభ సచివాలయం ఎక్స్‌లో చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ పీఎంఓ ఇండియా ఇలా పేర్కొంది:

"28వ సీఎస్‌పీఓసీ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో.. వసుధైక కుటుంబం స్ఫూర్తితోదేశం తన ప్రజా మౌలిక సదుపాయాలను  కామన్వెల్త్ దేశాలతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పేర్కొన్నారు.

సాంకేతికతను భారత్ సొంత ఆస్తిగా భావించదనిప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేసే ప్రజా ప్రయోజనంగా చూస్తుందని ఆయన రాశారు’’


(रिलीज़ आईडी: 2214972) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam