గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగిసిన రాష్ట్రీయ ఖనిజ్ చింతన్ శిబిరం: జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం, సుస్థిర గనుల తవ్వకంపై సారించిన దృష్టి

प्रविष्टि तिथि: 10 JAN 2026 4:42PM by PIB Hyderabad

గాంధీనగర్గుజరాత్: ‘రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిరం-2026’ ముగిసిందిఈ కార్యక్రమంలో సుస్థిర మైనింగ్‌ను కొనసాగించడానికిదేశంలో కీలకమైన ఖనిజాల అవసరాలను తీర్చడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబద్ధతను తెలియజేశాయిభారతీయ మైనింగ్ రంగాన్ని బలోపేతం చేసే కీలకాంశాలపై చింతనా శిబిరం రెండో రోజు దృష్టి సారించిందిఅలాగే జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమంసుస్థిర మైనింగ్ పద్ధతులుదీర్ఘకాల ఖనిజ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా చర్చించారుసమన్వయంతో కూడినభవిష్యత్తుకు తగిన విధానాల ద్వారా మైనింగ్ విలువ ఆధారిత వ్యవస్థలో దేశీయ సామర్థ్యాలను విస్తరించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమంలో జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమ విధానాల గురించి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వివేక్ కుమార్ బాజ్‌పాయ్ వివరించారుపరిశ్రమలుపరిశోధనా సంస్థల సహకారంతో కీలక ఖనిజాలను గుర్తించడంవాటిని అన్వేషించడంవేలానికి సంబంధించిన వ్యూహాలుదేశీయ మైనింగ్ రంగాన్నిశుద్ధి సామర్థ్యాలను బలోపేతం చేయడంవిలువ జోడింపును ప్రోత్సహించడంస్థిరమైన సరఫరా వ్యవస్థలను నిర్మించే చర్యలకు సంబంధించిన కార్యక్రమాల గురించి తెలియజెప్పారు.

వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాలను సేకరించడం గురించి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోల్ జనరల్ శ్రీ పంకజ్ కులశ్రేష్ట వివరించారుఖనిజాల లభ్యతను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికతలనుద్వితీయ వనరులను ఉపయోగించుకొనే అవకాశాల గురించి తెలియజేశారుఅదే సమయంలో పర్యావరణపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూపునర్వినియోగ మైనింగ్ పద్ధతులను అవలంబించడంపై చర్చించారు.

గనుల శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. జాతీయ వృద్ధిలో మైనింగ్ రంగం అందిస్తున్న సహకారాన్ని పెంపొందించేందుకు సకాలంలో గనుల నిర్వహణ చేపట్టాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేశారువేగవంతమైనజవాబుదారీతనంతో కూడిన ప్రక్రియల అవసరం గురించిదేశాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా.. గనుల కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు గనుల మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

పంజాబ్‌ గనుల రంగంలో సాధిస్తున్న పురోగతినిసామర్థ్యాన్ని ఆ రాష్ట్ర గనుల మంత్రి శ్రీ బరీందర్ కుమార్ గోయల్ వెల్లడించారుఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతలుసుస్థిర విధానాలుసమర్థమైన విధాన చర్యలను స్వీకరించాల్సిన అవసరాన్ని తెలియజెప్పారు.

సమగ్రమైనసుస్థిరమైన అభివృద్ధికి అవసరమైన పునాదిగా మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యాన్ని కేంద్ర బొగ్గుగనుల మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి తెలియజేశారుమైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారుఅలాగే విస్తృత గనుల మూసివేత ప్రణాళిక అవసరాన్నిఖనిజాల బ్లాకులను సకాలంలో వేలం వేయాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారుమైనింగ్ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్రాలు కీలకంగా వ్యవహరించాలన్నారు. 2047 నాటికి ఆత్మనిర్భర భారత్వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా బాధ్యతాయుతమైన మైనింగ్‌ను ప్రోత్సహించడంలోదేశీయంగా మైనింగ్ భద్రతను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

రెండు రోజుల ఈ సదస్సుకు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డికేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్కేంద్ర కార్మికఉపాధియువజన వ్యవహరాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయబీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హారాష్ట్రాల మంత్రులుగనుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారుఎనిమిదికి పైగా రాష్ట్రాలకు చెందిన గనుల శాఖ మంత్రులుఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారుఇది మైనింగ్ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2213647) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil