వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
प्रविष्टि तिथि:
08 JAN 2026 8:04PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని కృషి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఆహారం, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), అంతర్జాతీయ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), వ్యవయసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి (ఐఎఫ్ఏడీ), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), డాయిచ్ గేజెల్‌షాఫ్ట్ ఫ్యూర్ ఇంటర్నేషనల్ సుజామెన్‌అర్బైట్ (జీఐజెడ్), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) సహా ప్రధాన అంతర్జాతీయ, బహుపాక్షిక అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని, జీవనోపాధిని మెరుగుపరచడానికి, దీర్ఘకాల విధానాలను రూపొందించడంతో సహా సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, దీర్ఘకాల అభివృద్ధి ప్రాధాన్యాలను సమన్వయం చేయడం, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందించడంపై ఈ సమావేశంలో దృష్టి సారించారు.

ఆహార లోటు నుంచి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రధాన దేశంగా మారిన భారతీయ వ్యవసాయ ప్రయాణం అసాధారణమైనదని శ్రీ చౌహాన్ చెప్పారు. దీనిలో అంతర్జాతీయ సంస్థలు పోషించిన పాత్రను వివరించారు. ఆహార భద్రతను సాధించిన భారత్, ఇప్పుడు పోషకాహార భద్రతను సాధించడం, సుస్థిర జీవనోపాధి అవకాశాలను అందించడంపై దృష్టి సారించిందని తెలియజేశారు. తన అనుభవాన్ని, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను ఇతర దేశాలతో పంచుకొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని అదే సమయంలో అంతర్జాతీయ ఆవిష్కరణలు, ఇతర దేశాల్లో అవలంబిస్తున్న విజయవంతమైన విధానాలను స్వీకరిస్తుందని తెలియజేశారు. తద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పరస్పర వృద్ధిని, సహకారాన్ని పెంపొందించుకుంటుందన్నారు.

సమగ్ర వ్యవసాయం, చిన్న రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలతో సహా సహకారానికి అవకాశమున్న ప్రధాన విభాగాల గురించి ప్రతినిధులు వివరించారు. అలాగే యువత, మహిళలు, రైతు సంఘాలపై ప్రధాన దృష్టి సారించారు. అలాగే పరిశోధనాభివృద్ధి, డిజిటల్ వ్యవసాయం, దిగుబడి అనంతర మౌలిక సదుపాయాలను విస్తరించడంపై దృష్టి సారించడంతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, రుణాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, పెట్టుబడుల ప్రాధాన్యం గురించి వారు చర్చించారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొనే పంటలు, సహజ వనరుల నిర్వహణ గురించి కూడా చర్చించారు.
WMCV.jpeg)
విలువైన సలహాలు, సూచనలు అందించిన ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇవి వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక ప్రణాళికలను బలోపేతం చేయడంలో, విధాన నిర్ణయాలను రూపొందించడంలో కీలకంగా మారతాయని, ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే దిశగా మన సహకారాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ కార్యదర్శి, డీఏఆర్ఈ కార్యదర్శి, డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ అదనపు కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2212932)
आगंतुक पटल : 5