సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఎస్ఐ స్మారకాలు, మ్యూజియాలకు ఆన్‌లైన్ బుకింగ్ ఇక ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో అందుబాటులోకి

प्रविष्टि तिथि: 06 JAN 2026 7:26PM by PIB Hyderabad

కేంద్ర సంరక్షణలో ఉన్న 170 కి పైగా స్మారకాలు, మ్యూజియాల సందర్శనకు ఆన్‌లైన్ టికెట్ బుకింగును సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్ఐ).. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో మొదలుపెట్టింది.
ఈ కార్యక్రమం డిజిటల్ మాధ్యమంలో ఏఎస్ఐ స్మారకాలు, మ్యూజియాల అందుబాటును గణనీయంగా పెంచుతుంది. దీంతో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యటకులకు దేశంలో ప్రఖ్యాత వారసత్వ స్థలాలు, వస్తు ప్రదర్శన శాలల్లో కొన్నింటి ప్రవేశ టిక్కెట్లు అనేక డిజిటల్ వేదికల ద్వారా సులభంగా బుక్ చేసుకొనే వీలు చిక్కింది.
ఏఎస్ఐ టిక్కెట్ల వ్యవస్థను ఓపెన్ డిజిటల్ నెట్‌వర్క్‌లో ఏకీకరించడంతో పౌరులు, పర్యటకులు వేర్వేరు దరఖాస్తుల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొనే సౌలభ్యం ఏర్పడింది. దీంతో వీటి లభ్యత, సౌకర్యం మెరుగుపడడంతో పాటు ఇంటర్ ఆఫరబుల్ డిజిటల్ వ్యవస్థ ద్వారా సార్వజనిక సేవల్లో పారదర్శకత్వంతో పాటు సమర్థ అందజేత కూడా పటిష్ఠం కానుంది.
ఏఎస్ఐ స్మారకాలకు టిక్కెట్లను ఓఎన్‌డీసీ ఆధారిత దరఖాస్తుల ద్వారా బుక్ చేసుకొనే పర్యటకులు ప్రస్తుత సదుపాయాల ప్రయోజనాలను కూడా పొందొచ్చు.. భారతీయ పర్యటకులకు రూ.5, విదేశీ సందర్శకులకు రూ.50 తగ్గింపు ఈ సదుపాయాల్లో భాగంగా ఉంది.
స్మారకాలు, వస్తుప్రదర్శనశాలలో ఫిజికల్ టిక్కెట్టు కోసం వరుసలలో నిలబడే శ్రమను పర్యటకులు తప్పించుకొనే అవకాశాన్ని ఆన్‌లైన్ బుకింగు అందిస్తుంది. దీంతో ప్రవేశాలు వేగవంతం అవుతాయి, తేలికగా కూడా మారతాయి.
ఈ ఏకీకరణకు సాంకేతిక సహాయాన్ని ఎన్‌డీఎంఎల్ (ఎన్ఎస్‌డీఎల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) అందించింది. ఈ సంస్థ ఏఎస్ఐ స్మారకాలు, వస్తుప్రదర్శనశాలల పూర్తి ఇన్వెంటరీని ఓఎన్‌డీసీ నెట్‌వర్కుతో సంధానించింది.  
టిక్కెట్లు ప్రస్తుతానికి Highway Delite (వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్), Pelocalకు చెందిన వాట్సాప్ ఆధారిత టికెటింగ్ ఎక్స్‌పీరియన్స్ (యూజర్లు +91 84228 89057 నంబరుకు Hi సందేశాన్ని పంపించడం ద్వారా) అందుబాటులో ఉన్నాయి. అలాగే, Abhee by Mondee (ఆండ్రాయిడ్, ఐఓఎస్) వంటి వేదికల్లోనూ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. మరెన్నో ఇతర కన్‌జ్యూమర్ ఫేసింగ్ అప్లికేషన్లు ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌తో ఏకీకరణ తాలూకు వేర్వేరు దశల్లో ఉన్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2212280) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Punjabi