రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2026.. విజయవంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలు

प्रविष्टि तिथि: 05 JAN 2026 12:49PM by PIB Hyderabad

పాఠశాలదేశం పట్ల పిల్లల్లో ఐక్యతమమకారంగర్వాన్ని పెంపొందించేందుకు గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఆర్‌డీసీ) 2026లో భాగంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలు 2025-26 విజయవంతంగా ముగిశాయిదేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీలు నాలుగు విభాగాల్లో (అబ్బాయిల బ్రాస్ బాండ్అమ్మాయిల బ్రాస్ బాండ్అబ్బాయిల పైప్ బ్యాండ్అమ్మాయిల పైప్ బ్యాండ్మూడు స్థాయిల్లో (రాష్ట్రజోనల్జాతీయ(ఫైనల్స్థాయిలోజరుగుతాయి.

రాష్ట్ర స్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలుయూటీల నుంచి 824 పాఠశాల బ్యాండ్ బృందాలు నమోదు చేసుకోగా, 18,013 మంది పిల్లలతో కూడిన 763 బృందాలు పాల్గొన్నాయిజోనల్ స్థాయి పోటీలకు 94 బృందాలు ఎంపికయ్యాయిఒక్కో జోన్ నుంచి తుది పోటీలకు అర్హత సాధించిన నాలుగు బృందాలు అంటే.. నాలుగు జోన్ల (తూర్పుపశ్చిమఉత్తరందక్షిణంనుంచి మొత్తం 16 బృందాలు జనవరి 24, 2026న న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటాయిరక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన ప్రత్యేక జ్యూరీ సభ్యులు ఈ బృందాల ప్రదర్శనలకు నిర్ణేతరులుగా వ్యవహరిస్తారుఇందులో భారత రక్షణ రంగంలోని సైన్యంనావికాదళంవాయుసేన విభాగ ప్రతినిధులు సభ్యులుగా ఉండివిజేతలను నిర్ణయిస్తారు.

జాతీయ పాఠశాల బ్యాండ్ పోటీలను ఆర్‌డీసీ-2023 నుంచి రక్షణ మంత్రిత్వ శాఖవిద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయిబ్యాండ్ నుంచి వచ్చే లయబద్ధమైన సంగీతం.. పిల్లల్లోనూపెద్దల్లోనూ ఉత్సాహాన్నిధైర్యాన్నికార్యశీలతను ప్రోత్సహిస్తుందిఇది దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో దేశభక్తినిఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందివిద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రోత్సహిస్తుందిగతేడాది ఆర్‌డీసీ-2025 సందర్భంగారాష్ట్రస్థాయిలో మొత్తం 709 పాఠశాల బ్యాండ్ బృందాలు నమోదు చేసుకోగా.. 13,999 మంది పిల్లలతో 568 బృందాలు పోటీల్లో పాల్గొన్నాయి.


(रिलीज़ आईडी: 2211547) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil