ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైకిలింగ్‌లో శ్రీ ఎస్. సురేశ్ కుమార్ గారి స్ఫూర్తిదాయక విజయం.. అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 JAN 2026 10:01PM by PIB Hyderabad

శ్రీ ఎస్సురేశ్ కుమార్ గారు సాధించిన అసాధారణ విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారుశ్రీ సురేశ్ కుమార్ బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సాహసకృత్యం ప్రశంసనీయంస్ఫూర్తిదాయకం.. సురేశ్ కుమార్ గారి దృఢ సంకల్పానికీమొక్కవోని ఉత్సాహానికీ నిదర్శనంవిశేషించిగంభీర ఆరోగ్య సవాళ్లను అధిగమించి ఈ పనిని పూర్తి చేశారని శ్రీ మోదీ తెలిపారు.
ఇలాంటి ప్రయత్నాలు దేహ దారుఢ్యాన్నీదృఢ సంకల్పాన్నీ కలబోసి దేనినైనా సాధించవచ్చని సమాజంలో విస్తృత వర్గానికి ముఖ్య సందేశాన్ని అందిస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
శ్రీ సురేశ్ కుమార్ గారితో ప్రధానమంత్రి స్వయంగా ఆయనకు అభినందనలను తెలియజేశారుఈ యాత్ర ఆయన సాహసంపట్టుదలల వల్లే సాధ్యపడిందంటూ ప్రధానమంత్రి మెచ్చుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూఇలా పేర్కొన్నారు:
‘‘
బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు శ్రీ ఎస్సురేశ్ కుమార్ గారు సైకిల్‌‌ యాత్రను నిర్వహించడం ప్రశంసనీయమే కాక స్ఫూర్తిదాయకం కూడాఆరోగ్యపరమైన సవాళ్లను అధిగమించి మరీ ఈ అసాధారణ కార్యాన్ని ముగించడం ఆయన దృఢ సంకల్పాన్నీమొక్కవోని సాహసాన్నీ సూచిస్తోందిఇది ఫిట్‌నెస్‌కు సంబంధించి ఒక ముఖ్య సందేశాన్ని కూడా అందిస్తోంది.

ఆయనతో నేను మాట్లాడి... ఇందుకు అభినందనలు తెలియజేశాను.’’


(रिलीज़ आईडी: 2210766) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam