నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సోర్ కార్యక్రమంలో పాల్గొని, ఏఐ సర్టిఫికేట్లను అందించనున్న భారత రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 30 DEC 2025 4:39PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం (ఆర్‌బీసీసీ)లో జనవరి 1, 2026న గురువారం ఉదయం 11 గంటలకు స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ప్రారంభించిన సోర్ (స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు.

భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధివ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారుభవిష్యత్తులో ఏఐ రంగం కోసం భారత శ్రామిక శక్తిని సిద్ధం చేసేందుకు ప్రభుత్వానికున్న ప్రాధాన్యతను ఇది చాటిచెబుతుంది.

భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధివ్యవస్థాపకత శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యాశాఖ సహాయమంత్రి గౌరవ శ్రీ జయంత్ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ సందర్భంగా విద్యార్థులుపార్లమెంటు సభ్యులతో సహా పలువురు అభ్యర్థులకు కృత్రిమ మేథ (ఏఐసర్టిఫికేట్లను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందిస్తారుభవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించే లక్ష్యంతో #SkillTheNation Challenge జాతీయ అవగాహనా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిస్తారుఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్‌ లో "ఏఐ ఫర్ బిగినర్స్అనే ప్రత్యేక సెషన్‌ను ఎంఎస్‌డీఈ నిర్వహిస్తుందిఈ మంత్రిత్వ శాఖకు ప్రధాన ఏఐ భాగస్వామి అయిన గూగుల్ సహకారంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏఐ నిపుణుడు ఈ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్‌కు నాయకత్వం వహిస్తారు.

రాయిరంగ్‌పూర్‌లో ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఇది ఉత్తర ఒడిశాకు ప్రధాన విద్యా కేంద్రంగా పనిచేస్తుందిఇది నైపుణ్యాధారిత కోర్సులు అందిస్తూశిక్షణతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూవారికి అండగా నిలుస్తుంది.

వివిధ రంగాల్లో పని స్వభావాన్ని, నైపుణ్య అవసరాలను కృత్రిమ మేథ మారుస్తోందిఅందరికీ అందుబాటులో ఉండేలాప్రస్తుత కాలానికి అనుగుణంగా సమ్మిళిత ఏఐ శిక్షణకు ఎంఎస్‌డీఈ ప్రాధాన్యతనిస్తోందిసోర్ స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ నైపుణ్యాలను పొందేలా ఈ మంత్రిత్వ శాఖ తోడ్పాటునందిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2210037) आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam