రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో బిమల్‌గఢ్ అమృత్ స్టేషన్ పునరుద్ధరణ
కొత్త స్టేషన్ భవనం, ప్రవేశ-నిష్క్రమణ ద్వారాలు, సర్క్యులేటింగ్ ఏరియా, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు, వెయిటింగ్ హాల్, దివ్యాంగులకు అనువైన సౌకర్యాలు, మెరుగైన ఏర్పాట్లు, స్థానిక కళాకృతులతో కొత్త రూపు సంతరించుకున్న బిమల్‌గఢ్ స్టేషన్
నాడు పోస్టు చేయడమైనది:
30 DEC 2025 4:23PM by PIB Hyderabad
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 1300కి పైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటు, ఆధునిక సౌకర్యాల ద్వారా ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం స్థానిక అవసరాలకు ఆధారమైన విధానాన్ని అనుసరిస్తుంది. ఇది ప్రాంతీయ వృద్ధి, పర్యాటకం, సమర్థ రవాణాకు మద్దతునిస్తుంది.
ఈ పథకం కింద ఒడిశాలోని 59 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన స్టేషన్లలో బిమల్‌గఢ్ రైల్వే స్టేషన్ ఒకటి.

బిమల్‌గఢ్ జంక్షన్, ఒడిశా
బిమల్‌గఢ్ స్టేషన్ ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ ప్రయాణికులు, సరుకుల రవాణా కోసం కీలకమైనది. పునరాభివృద్ధి ద్వారా స్టేషన్‌ను పరిశుభ్రంగా, సురక్షితంగా, ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండేలా మారుస్తున్నారు.
ఈ పనులు ప్రధానంగా ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాయి. మెరుగైన ముఖద్వారంతో కొత్త స్టేషన్ భవనం నిర్మిస్తున్నారు. కొత్త ప్రవేశ-నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సర్క్యులేటింగ్ ఏరియా, మెరుగైన ప్లాట్‌ఫారమ్ షెల్టర్‌లు ప్రయాణికుల రవాణాను, సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సర్క్యులేటింగ్ ఏరియాలో, ప్లాట్‌ఫారంలపై దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ సులభంగా ప్రవేశం కల్పించేందుకు వీలుగా ర్యాంపులు, తాగునీటి వసతి, అంధులు నడవడానికి అనువైన మార్గాలు, బ్రెయిలీ సూచికలనూ ఏర్పాటు చేస్తున్నారు.
వెయిటింగ్ హాల్, కొత్త సీటింగ్ ఏర్పాట్లు ఇతర ప్రయాణీకుల సౌకర్యాల్లో భాగంగా ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్ ఉపరితలాలు మెరుగుపడుతున్నాయి. కానోపీలు, ముఖద్వారాల నవీకరణలు జరుగుతున్నాయి. ప్రాంతీయ గుర్తింపును ప్రతిబింబించేలా స్టేషన్ గోడలను స్థానిక కళలు, సాంస్కృతిక ఇతివృత్తాలతో పెయింట్ చేస్తున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బిమల్‌గఢ్ స్టేషన్ పునరాభివృద్ధి... ఆధునిక, సమ్మిళిత, ప్రయాణికుల-కేంద్రిత రైల్వే మౌలిక సదుపాయాల ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు అవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2210031)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28