రక్షణ మంత్రిత్వ శాఖ
దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్ఆడీవో
प्रविष्टि तिथि:
29 DEC 2025 8:45PM by PIB Hyderabad
చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి 2025 డిసెంబర్ 29న దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ (ఎల్ఆర్‌జీఆర్ 120) పినాకను విజయవంతంగా పరీక్షించారు. నిర్దేశించిన అన్ని వైమానిక విన్యాసాలను ప్రదర్శించేలా ఈ రాకెట్‌ను దాని గరిష్ఠ పరిధి అయిన 120 కి.మీ. వరకు పరీక్షించారు. అత్యంత కచ్చితత్వంతో ఎల్‌ఆర్‌జీఆర్ లక్ష్యాన్ని ఛేదించింది.

పరీక్షించేందుకు ఉపయోగించిన అన్ని పరికరాలు.. రాకెట్ ప్రయాణ మార్గాన్ని పూర్తిగా ట్రాక్ చేశాయి. ఈ రాకెట్‌ను హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చి ల్యాబరేటరీ సహకారంతో ఆర్మమెంట్ రీసెర్చి డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది. దీనికి డిఫెన్స్ రీసెర్చి డెవలప్మెంట్ ల్యాబరేటరీ, రీసెర్చి సెంటర్ ఇమారత్ తోడ్పాటు అందించాయి.
ఐటీఆర్, ప్రూఫ్ అండ్ ఎక్సపరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ప్రయోగాన్ని సమన్వయం చేశాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న పినాక లాంచర్ నుంచి ఎల్‌ఆర్‌జీఆర్‌ను ప్రయోగించారు. ఒకే లాంచర్ నుంచి వివిధ శ్రేణులకు చెందిన పినాక రాకెట్లను ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది.
ఈ విజయం సాధించిన డీఆర్‌డీవోను రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. దీర్ఘ శ్రేణి గైడెడ్ క్షిపణులను రూపొందించి విజయవంతంగా అభివృద్ధి చేయడం సాయుధ దళాల సామర్థ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. దీనిని మార్పును తీసుకొచ్చే చర్యగా అభివర్ణించారు.
రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఈ ప్రయోగాన్ని వీక్షించారు. మిషన్ లక్ష్యాలను సాధించిన అన్ని బృందాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2209733)
आगंतुक पटल : 10