ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో జరిగిన వీర్‌ బాల్‌ దివస్‌ వేడుక విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 DEC 2025 10:00PM by PIB Hyderabad

నేడు న్యూఢిల్లీలో జరిగిన వీర్ బాల్ దివస్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జాతీయ బాలల అవార్డులు అందుకున్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది చిన్నారులతో శ్రీ మోదీ ముచ్చటించారు. ‘‘పిల్లలతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టుల్లో ప్రధానమంత్రి  ఇలా పేర్కొన్నారు.

‘‘న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించన వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో మన పిల్లల ఉత్సాహం, జోష్‌ మాలో కొత్త శక్తిని నింపింది’’

‘‘వీర్ బాల్ దివస్ సందర్భంగా మన కుమారులు, కుమార్తెలకు శౌర్యం, పరాక్రమం, మానవత్వపు విలువలను బోధించే ‘నవ భారతానికి చిన్ని రక్షకులు’   నాటక ప్రదర్శన నా హృదయాన్ని హత్తుకుంది’’

‘‘ఈ ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది చిన్నారులకు ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు లభించింది. ఈ రోజు వారితో సంభాషించడం నాకు చాలా సంతోషంగా ఉంది’’.

‘‘వీర్ బాల్‌ దివస్ అత్యున్నత త్యాగానికి గౌరవం, భవిష్యత్తుకు స్పూర్తి కూడా. ఔరంగజేబు క్రూరత్వానికి వ్యతిరేకంగా చిన్న వయస్సులోనే ధైర్యవంతులైన సాహిబ్‌జాదాలు ప్రదర్శించిన శౌర్యం, పరాక్రమం ఈ దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’’

‘‘రాబోయే 10 ఏళ్లలో దేశాన్ని బానిసత్వ మనస్తత్వం నుంచి దేశాన్ని పూర్తిగా విముక్తి చేయాలని భారత్ నిర్ణయించుకుంది. 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పం కూడా ఇదే కావాలి’’

‘‘నేటి తరమే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యం వైపు నడిపిస్తుంది. వారి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసంపై నాకు పూర్తి నమ్మకం ఉంది’’

‘‘నేటి యువత గతంతో పోలిస్తే అవకాశాలు ఎక్కువగా ఉన్న సమయంలో పెరుగుతున్నారు. అందుకే వారిని దేశ నిర్మాణంలో కేంద్రంగా ఉంచి కొత్త విధానాలను రూపొందిస్తున్నాము’’

‘‘ఈ రోజు జరిగిన కార్యక్రమంలో యువతీ యువకులు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు’’


(రిలీజ్ ఐడి: 2209099) సందర్శకుల సూచీ సంఖ్య : : 37