అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగ విజయం ద్వారా ప్రపంచస్థాయి విశ్వసనీయతను పొందిన ఎల్‌వీఎం3: డాక్టర్ జితేంద్ర సింగ్


భారతదేశ భారీ ఉపగ్రహ ప్రయోగం, వాణిజ్య ప్రయోగ సామర్థ్యాల్లో ఈ మిషన్ కీలక ఘట్టం

प्रविष्टि तिथि: 24 DEC 2025 3:10PM by PIB Hyderabad

ఎల్‌వీఎం3-ఎంమిషన్ ద్వారా ఇవాళ బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందాన్ని కేంద్ర సైన్స్టెక్నాలజీభూ శాస్త్రాల శాఖపీఎంఓసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణు శక్తిఅంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారుదార్శనికత గల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇస్రో వరుసగా ఎన్నో ఘన విజయాలను సాధిస్తుందని కేంద్రమంత్రి అన్నారుఅంతరిక్ష సాంకేతిక రంగంలో పెరుగుతున్న భారత్ శక్తినివిశ్వసనీయతనుప్రపంచవ్యాప్తంగా మనదేశ స్థాయిని మరోసారి ఈ విజయం చాటిచెప్పిందని తెలిపారు.

ఎల్‌వీఎం3-ఎంమిషన్ ద్వారా భారత్ చారిత్రాత్మక ఘట్టాన్ని చేరుకుందిభారత ప్రయోగ వాహనం మోసుకెళ్లిన అత్యంత బరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందిఈ మిషన్భారీ ఉపగ్రహాలను మోసుకెళ్లగల భారతదేశపు సామర్థ్యాన్ని సూచించటమే కాకఅంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ స్థానాన్ని మరింత బలపరిచింది.

ఎల్‌వీఎం3-ఎంప్రయోగ వాహనం అద్భుతంగా పనిచేసిందనిబ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను భూమికి అతి దగ్గరలో ఉన్న కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని అంతరిక్ష విభాగం కార్యదర్శిభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారుభారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన అతి భారీ రాకెట్ ఇదేననిఎల్‌వీఎంచేపట్టిన మూడో పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ ఇదని తెలిపారుఈ మిషన్ విజయం ఎల్‌వీఎంరాకెట్ తిరుగులేని విశ్వసనీయతనుప్రపంచస్థాయి పనితీరుని ప్రతిబింబిస్తుందనితద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో అత్యుత్తమ రాకెట్ల సరసన ఇది నిలిచిందని వ్యాఖ్యానించారు.

తదుపరి తరం ఉపగ్రహ సమూహంలో బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహం ఒక భాగంఎటువంటి ప్రత్యేక పరికరాల అవసరం లేకుండానే అంతరిక్షం నుంచి సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్లలకు అందించేలా దీన్ని రూపొందించారుఅమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించిందిప్రపంచవ్యాప్త అత్యాధునిక కమ్యూనికేషన్ ప్రయోగాలకు నమ్మకమైన లాంచ్ సర్వీస్ ప్రొవైడర్‌గా భారత్ ఎదుగుతుందని ఈ విజయం చాటిచెబుతోంది.

లాంచ్ వెహికల్ మార్క్-3 (ఎల్‌వీఎం3) ప్రయోగ విజయంతో సంక్లిష్టమైన భారీ ఉపగ్రహాలను మోసుకెళ్లే మిషన్లలో భారత్ సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుందిఈ ప్రయోగం స్వదేశీ వ్యవస్థలపై నమ్మకాన్ని బలపరచటమే కాకఅంతర్జాతీయ అంతరిక్ష రంగంలో దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చింది.

 

***


(रिलीज़ आईडी: 2208235) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil