లోక్‌సభ సచివాలయం
18వ లోక్ సభ ఆరవ సమావేశం ముగింపు
18వ లోక్ సభ ఆరవ సమావేశాల్లో 111 శాతం ఉత్పాదకత నమోదు: లోక్‌సభ స్పీకర్
ఆరవ సెషన్ లో 15 సార్లు సమావేశమైన లోక్ సభ.. మొత్తం 92 గంటల 25 నిమిషాలపాటు కొనసాగిన సమావేశాలు: లోక్‌సభ స్పీకర్
లోక్ సభలో ప్రవేశపెట్టిన 10 ప్రభుత్వ బిల్లులు.. 8 బిల్లులకు ఆమోదం: లోక్‌సభ స్పీకర్
‘‘వందే మాతరం’’ చర్చలో పాల్గొన్న 65 మంది సభ్యులు.. 11 గంటల 32 నిమిషాల పాటు కొనసాగిన సుదీర్ఘ చర్చ: లోక్‌సభ స్పీకర్
ఎన్నికల సంస్కరణలపై 13 గంటల పాటు చర్చ.. తమ అభిప్రాయాలను పంచుకున్న 63 మంది సభ్యులు: లోక్‌సభ స్పీకర్
సమావేశాల్లో భాగంగా అత్యవసర ప్రజా ప్రాముఖ్యత కలిగిన 408 అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చిన సభ్యులు : లోక్‌సభ స్పీకర్
प्रविष्टि तिथि:
19 DEC 2025 2:53PM by PIB Hyderabad
డిసెంబర్ 1న ప్రారంభమైన పద్దెనిమిదవ లోక్ సభ ఆరవ సమావేశాలు నేటితో ముగిశాయి.
మొత్తం 15 సార్లు లోక్సభ సమావేశమైందని స్పీకర్ శ్రీ ఓం బిర్లా వెల్లడించారు. 92 గంటల 25 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు తెలిపారు.
ఈ సమావేశాల్లో 111 శాతం ఉత్పాదకత నమోదైందని స్పీకర్ చెప్పారు.
మొత్తం 10 ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టగా.. 8 బిల్లులకు ఆమోదం లభించింది. ఆమోదించిన బిల్లులు ఇవే..
(i) మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (రెండో సవరణ) బిల్లు 2025
(ii) సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025
(iii) హెల్త్ సెక్యూరిటీస్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025
(iv) అప్రాప్రియేషన్ (నంబర్ 4) బిల్లు 2025
(v) రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు
(vi) సబ్కా బీమా సబ్ కీ రక్ష (బీమా చట్టాల సవరణ) బిల్లు 2025
(vii) సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్సఫార్మింగ్ ఇండియా బిల్లు
(viii) వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు 2025
డిసెంబర్ 15న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత అనుబంధ నిధుల డిమాండ్లపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత అప్రోప్రియేషన్ (నెంబర్ 4) బిల్లు 2025కు ఆమోదం లభించింది.
డిసెంబర్ 8న జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి దీనిపై చర్చను ప్రారంభించారు. ఈ అంశంపై 11 గంటల 32 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో 65 మంది సభ్యులు పాల్గొన్నారు. దీంతోపాటు డిసెంబర్ 9, 10 తేదీల్లో ‘‘ఎన్నికల సంస్కరణలు’’ అంశంపై సుమారు 13 గంటల పాటు చర్చ జరిగింది. ఇందులో 63 మంది సభ్యులు పాల్గొన్నారు.
సమావేశాల్లో భాగంగా.. 300 నక్షత్రపు గుర్తు గల ప్రశ్నలు స్వీకరించగా.. వాటిలో 72
ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానం ఇచ్చారు. అదేవిధంగా 3449 నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు స్వీకరించారు.
జీరో అవర్ సమయంలో సభ్యులు మొత్తం 408 అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల విషయాలను లేవనెత్తారు. రూల్ 377 కింద మొత్తం 372 విషయాలు చర్చకు స్వీకరించారు. డిసెంబర్ 11న సభలో జీరో అవర్లో 150 మంది సభ్యులు తమ అంశాలను ప్రతిపాదించారు.
సమావేశాల్లో డైరెక్షన్ 73ఏ కింద 35 ప్రకటనలు ఇవ్వగా.. మొత్తం 38 ప్రకటనలు వచ్చాయి. వీటిలో రెండు నియమాలు 372 కింద, ఒకటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గం ద్వారా వచ్చినవి ఉన్నాయి.
ఈ సమావేశాల్లో మొత్తం 2,116 పత్రాలను సభ ముందు ఉంచారు. వివిధ శాఖలకు సంబంధించిన 41 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను సభలో ప్రవేశపెట్టారు.
సమావేశాల సందర్భంగా డిసెంబర్ 5న వివిధ అంశాలపై 137 ప్రైవేటు సభ్యుల బిల్లులు ప్రవేశపెట్టారు. 12న శ్రీ షఫీ పరంబిల్ ప్రవేశపెట్టిన ఒక ప్రైవేటు సభ్యుల తీర్మానంపై చర్చల అనంతరం సభ అనుమతితో దానిని ఉపసంహరించుకున్నారు.
డిసెంబర్ 2న జార్జియా పార్లమెంటు చైర్మన్ శ్రీ షాల్వా పాపుయాష్విలి నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి భారత పార్లమెంట్ ఘనస్వాగతం పలికింది.
***
(रिलीज़ आईडी: 2206733)
आगंतुक पटल : 16