అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

లోక్‌సభ ఆమోదం తెలిపిన శాంతి బిల్లు-2025కు రాజ్యసభ ఆమోదం


శాంతి బిల్లు ప్రకారం కీలక పదార్ధాలు, వినియోగించిన ఇంధనంపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ..

అణు భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు: డాక్టర్ జితేంద్ర సింగ్

ఆస్పత్రుల నుంచి వ్యవసాయ క్షేత్రాలు, క్యాన్సర్ చికిత్స వరకు దేశ సామాన్యుడి జీవితంలో

అణు శాస్త్రం కీలకమన్న డాక్టర్ జితేందర్ సింగ్

ప్రజా ప్రయోజనాలు, సార్వభౌమాధికారం, భద్రతకు భరోసానిస్తూ

పీఎం మోదీ దార్శనికతతో అణుశక్తి సంస్కరణలకు మార్గం సుగమం

భారతీయ అణు విద్యుత్ కేంద్రాల వద్ద అంతర్జాతీయ పరిమితుల కంటే తక్కువ స్థాయిలోనే రేడియేషన్

క్యాన్సర్ ముప్పు లేదని రాజ్యసభలో వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 18 DEC 2025 7:45PM by PIB Hyderabad

లోక్‌సభలో ఆమోదం పొందిన సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతిబిల్లు-2025పై కేంద్ర సైన్స్టెక్నాలజీభూ శాస్త్రాల శాఖపీఎంఓసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణు శక్తిఅంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొనిబిల్లులోని కీలక నిబంధనలను స్పష్టం చేస్తూసభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారుఅణు భద్రతదేశ సార్వభౌమాధికారంప్రజా జవాబుదారీతనం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

 

ఈ బిల్లు, అణు ఇంధన చట్టం-1962, అణు నష్టానికి పౌర బాధ్యత (సీఎల్ఎన్‌డీచట్టంలోని నిబంధనలను క్రమబద్ధీకరించిఏకీకృతం చేస్తుందనిఅణుశక్తి నియంత్రణ బోర్డుకు చట్టబద్ధత కల్పిస్తూదాన్ని ప్రధాన చట్టంలో భాగంగా చేర్చినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుఇది నియంత్రణ పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తుందనిఅణు నిర్వహణలో అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాల పట్ల భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన వెల్లడించారు.

 

మారుతున్న ప్రపంచసాంకేతిక పరిస్థితులపై మాట్లాడుతూ, 2010లో అణు ఇంధన సంస్కరణలపై లేవనెత్తిన అభ్యంతరాలను వాస్తవ పరిస్థితుల దృష్ట్యా పునః సమీక్షించాలని డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారునేడు సాంకేతికతభద్రతా వ్యవస్థలుప్రపంచ ఇంధన అవసరాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారుచిన్న మాడ్యులర్ రియాక్టర్లుభారత స్మాల్ రియాక్టర్లు పదిహేనేళ్ల కిందట ఊహకందని అంశాలనీఇప్పుడవి 24 గంటల పాటు సురక్షితంగాసమర్ధవంతంగా విద్యుత్‌ను అందించే పరిష్కారాలుగా మారుతున్నాయని చెప్పారు.

 

భద్రతాపరమైన ఆందోళనలను కేంద్రమంత్రి ప్రస్తావిస్తూఅణు భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదనివాటి విషయంలో రాజీ పడబోమనిఅణుశక్తి చట్టం-1962లో పొందుపరిచిన "ముందుగా భద్రతతర్వాతే ఉత్పత్తివంటి కఠిన సూత్రాల ఆధారంగానే ఉంటాయని వెల్లడించారుకఠినమైన తనిఖీ విధానాలను వివరిస్తూనిర్మాణదశలో త్రైమాసిక తనిఖీలునిర్వహణ దశలో ద్వైవార్షిక తనిఖీలులైసెన్స్ పునరుద్ధరణకు ఐదేళ్లకొకసారి తనిఖీలుచట్టబద్ధత పొందిన అణుశక్తి నియంత్రణ మండలికి అదనపు అధికారాలు కల్పించటంఅంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షణ ఉంటుందని చెప్పారుభూకంప ప్రభావిత ప్రాంతాలకు దూరంగా భారత్‌లో అణు విద్యుత్ కేంద్రాలున్నాయనిభారత రియాక్టర్ల రేడియేషన్ స్థాయిలు అంతర్జాతీయ భద్రతా పరిమితులకన్నా చాలా తక్కువగా ఉన్నట్లు సభకు తెలియజేశారు.

 

భారత అణు రియాక్టర్ల వల్ల క్యాన్సర్ కారక ప్రభావాలుంటాయనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. కూడంకుళంకల్పక్కంరావత్ బటాతారాపూర్ అణు విద్యుత్ కేంద్రాల వద్ద రేడియేషన్ ఉద్గారాల గణాంకాలను మైక్రో సీవర్ట్స్‌లో చెబుతూ.. అనుమతించిన పరిమితుల కంటే తక్కువగానే రేడియేషన్ స్థాయిలున్నట్లు వెల్లడించారుఅణురంగంలో సైబర్ భద్రతా ప్రమాణాలను భారత్ గణనీయంగా మెరుగుపరిచిందనిమారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ దాడులను ఎదుర్కోవటానికి ఎన్‌క్రిప్షన్సురక్షిత కోడింగ్రెగ్యులర్ ఆడిట్స్మాల్వేర్ ఫిల్టరింగ్వివిధ స్థాయిల్లో డిజిటల్ రక్షణ వంటి అత్యాధునిక సాంకేతికతలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

 

ప్రైవేటీకరణపై అపోహలను తొలగిస్తూ, అన్వేషణ కార్యకలాపాల్లో నిర్ణీత నిబంధనల మేరకు ప్రైవేట్ భాగస్వాములను అనుమతించినప్పటికీనిర్దేశించిన పరిమితులకు మించి జరిగే యురేనియం మైనింగ్ మాత్రం ప్రభుత్వాధీనంలోనే ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారువినియోగించే ఇంధన నిర్వహణ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటుందని చెప్పారుఇందుకోసం స్పష్టమైనదీర్ఘకాలిక నిల్వనిర్వహణ నిబంధనలను ప్రభుత్వం అనుసరిస్తుందని వెల్లడించారుకీలకమైన ముడి సామాగ్రివిచ్ఛిన్నమయ్యే పదార్థాలుభారజలం వంటివి కచ్చితంగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని చెప్పారు.

 

జవాబుదారీతనం, పరిహారం గురించి వివరిస్తూచిన్న తరహా పెట్టుబడిదారులను ప్రోత్సహించేలా ఈ బిల్లులో అంచెలవారీగా బాధ్యతా పరిమితులను ప్రవేశపెట్టినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారుబాధితులకు అందే పరిహారంలో ఇది ఎలాంటి కోతలు విధించదని స్పష్టం చేశారుఆపరేటర్ బాధ్యతా పరిమితిని దాటి నష్టం జరిగితేప్రభుత్వ నిధులుఅంతర్జాతీయ ఒప్పందాల ద్వారా పూర్తి పరిహారం చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామనితద్వారా బాధితులకు రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారుఅణు నష్టం నిర్వచనాన్ని పర్యావరణ నష్టానికి విస్తరిస్తూ ఈ బిల్లులో చేర్చినట్లు చెప్పారు.

 

పౌరుల వివాదాలను వేగంగా పరిష్కరించటానికి అటామిక్ ఎనర్జీ రిడ్రెస్సల్ కమిషన్ ను ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. సివిల్ కోర్టులకుఉన్నత న్యాయస్థానాలకు వెళ్లే హక్కును ఇది ఏ మాత్రం ప్రభావితం చేయదని చెప్పారుఅణు వ్యవహారాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి ఈ బిల్లు తప్పిస్తుందనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.

 

సార్వభౌమాధికారం, విదేశీ ప్రభావంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు సమాధానమిస్తూభారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తినిసంప్రదాయ బలాలను పణంగా పెట్టకుండాకేవలం దేశ పరిస్థితులకు సరిపోయే అంతర్జాతీయ అత్యుత్తమ పద్ధతులను మాత్రమే అవలంబిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుశాంతి బిల్లు పౌర అణుశక్తికి మాత్రమే సంబంధించినదనియురేనియం స్థాయులను కేవలం రియాక్టర్ అవసరాలకు మాత్రమే పరిమితం చేశామనిఅణ్వాయుధ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయంఆహార భద్రతక్యాన్సర్ చికిత్స వంటి రంగాల్లో అణుశాస్త్రం విస్తరిస్తున్న తీరుని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుటాటా మెమోరియల్ సెంటర్ వంటి సంస్థల ద్వారా చిన్నారుల్లో ల్యూకేమియాప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో అణు వైద్యం సాధించిన పురోగతి గురించి చెప్పారుపరిశోధనల్లో భాగస్వామ్యాన్ని సులభతరం చేయటం ద్వారా ఆవిష్కరణల వేగం పెరుగుతుందన్నారు.

 

దీర్ఘకాలిక భారత అణు శక్తి రోడ్ మ్యాప్ గురించి వివరిస్తూ, దేశం ఇప్పటికే జీడబ్ల్యూ అణు సామర్థ్యాన్ని సాధించిందని, 2032 నాటికి 22 జీడబ్ల్యూ, 2037 నాటికి 47 జీడబ్ల్యూ, 2042 నాటికి 67 జీడబ్ల్యూ, 2047 నాటికి 100 జీడబ్ల్యూ చేరటమే భారత్ లక్ష్యమని కేంద్రమంత్రి తెలిపారుభారతదేశ మొత్తం ఇంధన అవసరాల్లో ఇది దాదాపు 10% తీరుస్తుందని ఆయన చెప్పారుకృత్రిమ మేథడిజిటల్ మౌలిక సదుపాయాల పెరుగుదలతో భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్ డిమాండ్ ను తీర్చేందుకు అణుశక్తి అత్యంత కీలకమని స్పష్టం చేశారుఇతర పునరుత్పాదక ఇంధన వనరులతో పోల్చితే.. విశ్వసనీయమైనస్వచ్ఛమైన విద్యుత్‌ను నిరంతరం అణు శక్తి అందిస్తుందని వివరించారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగాన్ని ముగిస్తూ.. భారతదేశ ఆత్మవిశ్వాసాన్నిశాస్త్రీయ పరిణతినిప్రపంచస్థాయిలో పర్యావరణహిత ఇంధన పరివర్తనకు బాధ్యతాయుతమైన నాయకత్వానికి సంసిద్ధతను శాంతి బిల్లు ప్రతిబింబిస్తుందని అన్నారునిర్మాణాత్మకమైన సలహాలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనినిబంధనల రూపకల్పనకు భాగస్వాములను సంప్రదిస్తుందనిదేశ అణు శక్తి ప్రయాణం నిరంతరం భద్రతపారదర్శకతజాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగుతుందని సభ్యులందరికీ హామీ ఇచ్చారు.

 

***


(रिलीज़ आईडी: 2206499) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam