రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిసెంబరు 8, 14 తేదీల మధ్య కాలంలో మొత్తంమీద 80 శాతం సమయపాలనను సాధించిన భారతీయ రైల్వే


సమయపాలన: 22 డివిజన్లలో 90 శాతానికి మించిన ఫలితాలు

96 శాతం సమయపాలనతో అగ్రగామి డివిజన్లుగా రత్లామ్, తిరుచిరాపల్లి, మదురై

प्रविष्टि तिथि: 18 DEC 2025 4:09PM by PIB Hyderabad

కార్యకలాపాల్లో సమర్థతను పెంచడంతో పాటుప్రయాణికులకు సమయానికి తగ్గ సేవలు అందేటట్లు చూడటంపై భారతీయ రైల్వే నిరంతరంగా దృష్టి సారిస్తోందిడిసెంబరు 8, 14 తేదీల మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రైళ్లు సమయపాలనను పాటించడంలో 80 శాతం ఫలితాల్ని సాధించాయిఇది నిర్ధారిత కాలపట్టికలను నిర్వహించడంలో రైల్వే డివిజన్ల పట్టు వీడని కృషిని ప్రతిబింబిస్తోందిఅన్ని డివిజన్లలోకీ, 37 డివిజన్లు 80 శాతానికి మించిన సమయపాలనను సాధించాయి. 22 డివిజన్లు 90 శాతానికి మించిన సమయపాలనను నమోదు చేశాయిఈ విషయంలో 10 డివిజన్లు 95 శాతాన్ని దాటాయి.
సమయాన్ని పాటించడంలో ఉన్నత శ్రేణి ఫలితాల్ని కనబరిచిన డివిజన్లలోపశ్చిమ రైల్వే పరిధిలోని రత్లామ్ స్కోరు 98.5 శాతంగా ఉందిసదరన్ రైల్వే పరిధిలోని తిరుచిరాపల్లి 97.5 శాతంఇదే పరిధిలోని మదురై 96.7 శాతం సమయపాలనను నమోదు చేసి తరువాతి స్థానాల్లో నిలిచాయి.
సామర్థ్యం పెంపొందడంతో రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయిఇది ప్రయాణికులకే కాకుండా సరకు రవాణా సేవలకు కూడా ప్రయోజనకరంగా ఉంది.


(रिलीज़ आईडी: 2206127) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada