ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వైద్య విద్యపై తాజా సమాచారం
· కేంద్ర ప్రాయోజిత పథకాల కింద (2025-26 నుంచి 2028-29 వరకు) ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 10,023 సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వ ఆమోదం
· ‘ఎంబీబీఎస్’.. ‘పీజీ’ స్థాయులలో 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల మధ్య 48,563, 29,080 వంతున సీట్ల పెరుగుదలతో వైద్య విద్యకు గణనీయ ప్రోత్సాహం: ఎన్‌ఎంసీ
प्रविष्टि तिथि:
16 DEC 2025 3:03PM by PIB Hyderabad
జాతీయ వైద్యవిద్యా కమిషన్ (ఎన్‌ఎంసీ) సమాచారం ప్రకారం దేశంలోని వైద్య కళాశాలల్లో 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకూ ‘ఎంబీబీఎస్’లో 48,563, ‘పీజీ’ స్థాయిలో 29,080 వంతున సీట్ల సంఖ్య పెరిగింది.
ఈ నేపథ్యంలో 2025-26 నుంచి 2028-29 వరకూ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రభుత్వ కళాశాలల్లో మరో 10,023 సీట్ల పెంపునకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఈ విధంగా దేశంలోని వైద్య కళాశాలల్లో సీట్ల పెరుగుదల వల్ల వైద్య విద్యాభ్యాసంపై ఆసక్తిగల విద్యార్థులు మరింత ఎక్కువ సంఖ్యలో తమ కలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.
దేశంలో 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకూ పీజీ సీట్ల సంఖ్య వివరాలు:
వ.సం.
|
విద్యా సం॥
|
సీట్ల పెరుగుదల
|
1
|
2020-21
|
4983
|
2
|
2021-22
|
4705
|
3
|
2022-23
|
2874
|
4
|
2023-24
|
4713
|
5
|
2024-25
|
4186
|
6
|
2025-26
|
7619
|
దేశంలో వైద్య విద్య నాణ్యత పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన అత్యున్నత నియంత్రణ సంస్థ ‘ఎన్‌ఎంసీ’ కళాశాలల్లో నిర్దేశిత ప్రమాణాల అనుసరణ దిశగా ‘మినిమం స్టాండర్డ్స్ రిక్వైర్‌మెంట్’ (ఎంఎస్‌ఆర్), ‘అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’ (జీఎంఈఆర్), ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’ (ఎంఎస్‌ఎంఈఆర్), ‘కాంపిటెన్సీ-బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) కరికులం గైడ్‌లైన్స్-2024’ వంటి వివిధ నిబంధనలను జారీచేసింది. నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య, శిక్షణలో సమగ్రత, నాణ్యత పరిరక్షణ దిశగా ఈ నిబంధనలను ‘ఎన్‌ఎంసీ’ రూపొందించింది.
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
(रिलीज़ आईडी: 2204934)
आगंतुक पटल : 8