రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి భవన్‌లో పరంవీర్ గ్యాలరీని ప్రారంభించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

प्रविष्टि तिथि: 16 DEC 2025 12:53PM by PIB Hyderabad

ఈ రోజు (డిసెంబరు16, 2025) విజయ్ దివస్ఈ సందర్బంగా రాష్ట్రపతి భవన్‌లో పరంవీర్ గ్యాలరీని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు.
21 
మంది పరంవీర్ చక్ర పురస్కార గ్రహీతల చిత్రాలను ఈ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారుజాతీయ వీరుల గురించీదేశ రక్షణలో వారు చూపిన అజేయ స్ఫూర్తిని తెలియజేయడం ఈ గ్యాలరీ ఉద్దేశంమాతృభూమి సేవలో ప్రాణాలను అర్పించిన మన వీరుల్ని స్మరించుకొంటూవారిని గౌరవించుకోవడంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పరంవీర్ గ్యాలరీ ప్రాంతంలో పూర్వపు బ్రిటిషు రాజప్రతినిధుల చిత్రాలు ఉండేవిమన దేశ వీరుల చిత్తరువులను ప్రదర్శించడం వలసవాద ఆలోచనా విధానానికి స్వస్తి చెప్పిదేశాభిమానంవైభవంవారసత్వంతో పాటు  కాలదోషం పట్టని సంప్రదాయాల్ని అక్కున చేర్చుకొనే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తోంది.
పరం వీర్ చక్ర దేశంలో సైనికులకు అందజేసే అత్యున్నత పతకందీనిని యుద్ధ సమయంలో అమిత పరాక్రమాన్నీధైర్య సాహసాల్నీప్రాణత్యాగాన్ని చేసినందుకు ఇస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2204643) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam