సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వినికిడి.. దృష్టి లోపంగల వినియోగదారుల కోసం ఓటీటీ సౌలభ్య మార్గదర్శకాల ముసాయిదా ప్రకటించిన ప్రభుత్వం
· ఓటీటీ వేదికలపై వారికి కంటెంట్ లభ్యత దిశగా రెండు దశల అమలు కార్యక్రమం ప్రతిపాదించిన కేంద్రం
प्रविष्टि तिथि:
12 DEC 2025 4:30PM by PIB Hyderabad
దేశంలోని ‘ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్’ (ఓటీటీ) ప్రచురణ వేదికలలో వినికిడి, దృష్టి లోపంగల వ్యక్తులకు కంటెంట్ లభ్యత లక్ష్యంగా కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ 07.10.2025న మార్గదర్శకాల ముసాయిదాను జారీ చేసింది.
వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్యసమితి సమావేశం తీర్మానం అమలులో భారత్ బాధ్యత మేరకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద సంక్రమించిన రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా, దివ్యాంగుల హక్కుల చట్టం-2016తోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా, నైతిక నిబంధనలు) ప్రకారం ప్రస్తుతం అమలులోగల ఐటీ చట్టం-2000 (ఐటీ నిబంధనలు 2021) కింద 25.02.2021న ఈ ముసాయిదా మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
వినికిడి, దృష్టి లోపంగల వారికి ఓటీటీ వేదికలలోని దృశ్య-శ్రవణ కంటెంట్ అందుబాటులో ఉండేలా చూడటం ఈ ముసాయిదా మార్గదర్శకాల లక్ష్యం. దీన్ని రెండు దశలలో అమలు చేసేందుకు తగిన కార్యక్రమాన్ని కూడా ఈ మార్గదర్శకాలు సూచిస్తాయి.
వినికిడి లోపం ఉన్న వారి కోసం ‘దివ్యాంగులకు టెలివిజన్ కార్యక్రమాల సౌలభ్యం’ దిశగా ప్రమాణాలను నిర్దేశిస్తూ సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ 11.09.2019న ప్రకటన జారీచేసింది.
ఈ ప్రమాణాలలోని 12వ భాగంలో దశలవారీగా సౌలభ్య కల్పన పూర్తికావాలని, ముందుగా ప్రభుత్వ ప్రసార సంస్థ (ప్రసార భారతి) దీన్ని అమలు చేయాలని, తదుపరి ప్రైవేట్ టీవీలు, న్యూస్ చానెళ్లు దీన్ని అనుసరించాలని అందులో నిర్దేశించింది.
కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఇవాళ రాజ్యసభలో శ్రీమతి సంగీత యాదవ్, డాక్టర్ మేధా విశ్రమ్ కులకర్ణి, శ్రీ దీపక్ ప్రకాష్‌ల ప్రశ్నలకు సమాధానంగా ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2203363)
आगंतुक पटल : 3