వ్యవసాయ మంత్రిత్వ శాఖ
దక్షిణాది రాష్ట్రాల్లో సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
12 DEC 2025 6:26PM by PIB Hyderabad
పరంపరాగత్ కృషి వికాస్ యోజన ద్వారా 2015-16 నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకం కింద సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 3 సంవత్సరాల్లో హెక్టారుకు రూ. 31,500 సహాయం అందిస్తారు. ఇందులో పొలం/పొలం వెలుపల సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రైతులకు హెక్టారుకు రూ. 15,000 సహాయం అందిస్తారు. ఈ ఆర్థిక సహాయంలో సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ మద్దతూ భాగంగా ఉంటుంది.
2015-16 నుంచి 31.10.2025 వరకు పీకేవీవై పథకం కింద తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలకు విడుదల చేసిన నిధులు (కేంద్ర వాటా), విస్తీర్ణం కింది విధంగా ఉన్నాయి:
|
రాష్ట్రం పేరు
|
విడుదలైన నిధులు
(రూ. లక్షలలో)
|
కవర్ చేసిన విస్తీర్ణం
(హెక్టార్లలో)
|
|
తమిళనాడు
|
6236.35
|
32,940
|
|
కర్ణాటక
|
10049.36
|
49,100
|
|
కేరళ
|
6732.97
|
94,480
|
|
తెలంగాణ
|
3576.78
|
8,100
|
పీకేవీవై పథకం కింద రైతులకు 3 సంవత్సరాల కాలానికి ప్రయోజనాలు అందిస్తారు. 2024-25 కాలానికి కర్ణాటకలో 11,630 మంది రైతులు, తమిళనాడులో 28,983 మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు. అయితే, 2024-25 కాలానికి కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు నిధులు కేటాయించినా ఎటువంటి ఖర్చు చేయలేదు. ఈ కారణంగా రైతులెవరూ ప్రయోజనం పొందలేదు.
గత మూడు సంవత్సరాలతో పాటు ప్రస్తుత సంవత్సరం పీకేవీవై పథకం కింద తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణకు కేటాయించిన నిధుల (కేంద్ర వాటా) వివరాలు కింది విధంగా ఉన్నాయి:
|
రాష్ట్రం పేరు
|
కేటాయింపు (రూ. లక్షల్లో)
|
|
2022-23
|
2023-24
|
2024-25
|
2025-26
|
|
తమిళనాడు
|
704.87
|
1564.00
|
1620.00
|
1556.00
|
|
కర్ణాటక
|
1045.61
|
2803.00
|
1950.00
|
1769.00
|
|
కేరళ
|
1712.07
|
1047.00
|
782.60
|
1199.00
|
|
తెలంగాణ
|
30.75
|
568.00
|
424.60
|
1989.00
|
గమనిక: పీకేవీవైలో భాగంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం కేరళ రాష్ట్రం భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి (బీపీకేపీ)ని అమలు చేస్తోంది.
ఈ సమాచారాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2203360)
आगंतुक पटल : 17