సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ చిత్ర నిర్మాణ కేంద్రంగా మారుతున్న భారత్ - విధాన పరమైన ప్రక్రియలను సులభతరం చేస్తున్న ప్రభుత్వం
ఇండియా సినీ హబ్: దేశీయ, అంతర్జాతీయ చిత్ర నిర్మాణానికి కొత్త డిజిటల్ మార్గం
प्रविष्टि तिथि:
12 DEC 2025 4:36PM by PIB Hyderabad
చలనచిత్రాల చిత్రీకరణకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కొన్ని కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించింది.
ఈ దిశగా.. ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) పోర్టల్‌ను ప్రారంభించింది. చిత్రీకరణ అనుమతులకు దేశీయ, అంతర్జాతీయ చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకొనే వన్-స్టాప్ వేదిక ఇది. మిథిల, నలంద, గయతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మిక్/నాన్ ఫిల్మిక్ వనరులను, వైవిధ్యమైన షూటింగ్ ప్రాంతాలను గుర్తించేందుకు ఐసీహెచ్ నిర్మాతలకు సహకరిస్తుంది.
రాజ్యసభలో శ్రీ సంజయ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అందించారు.
(रिलीज़ आईडी: 2203157)
आगंतुक पटल : 4