ప్రధాన మంత్రి కార్యాలయం
మహాకవి సుబ్రమణ్య భారతి జయంతి.. ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
11 DEC 2025 10:20AM by PIB Hyderabad
ఈ రోజు మహాకవి సుబ్రమణ్య భారతి జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సుబ్రమణ్య భారతి కవితలు ధైర్యాన్ని అందించేవి, ఆయన ఆలోచనలు అసంఖ్యాకుల మంది మనసులలో చెరగని ముద్ర వేసేటంత శక్తివంతమైనవన్నారు. భారత సాంస్కృతిక, జాతీయ చైతన్యాన్ని అవి ప్రకాశవంతం చేశాయని శ్రీ మోదీ అన్నారు. అన్ని వర్గాల్నీ కలుపుకొని ముందడుగు వేసే సమాజాన్ని నిర్మించే దిశగా శ్రీ భారతి కృషి చేశారనీ, తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన అందించిన తోడ్పాటు సాటి లేనిదనీ ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ:
‘‘మహాకవి సుబ్రమణ్య భారతి జయంతి సందర్బంగా ఆయనకు నేను నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కవితలు ధైర్యాన్ని అందించాయి. అసంఖ్యాకుల మనసులో చెరగని ముద్ర వేసిన శక్తి ఆయన ఆలోచనలకు ఉంది. భారత సాంస్కృతిక చైతన్యాన్నీ, జాతీయ చైతన్యాన్నీ ఆయన ప్రకాశవంతం చేశారు. న్యాయ పూర్ణమైన, అన్ని వర్గాల్నీ కలుపుకొని ముందడుగు వేసే సమాజాన్ని నిర్మించే దిశగా ఆయన కృషి చేశారు. తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన అందించిన సేవ సాటిలేనిది.’’
“மகாகவி சுப்ரமணிய பாரதியின் பிறந்தநாளில் அவருக்கு மரியாதை செலுத்துகிறேன் . அவரது கவிதைகள் துணிவைத் தூண்டின, அவரது சிந்தனைகள் எண்ணற்ற மக்களின் மனதில் நீடித்த தாக்கத்தை ஏற்படுத்தும் ஆற்றலைக் கொண்டிருந்தன. இந்தியாவின் கலாச்சார, தேசிய உணர்வை அவர் ஒளிரச் செய்தார். நீதியான, அனைவரையும் உள்ளடக்கிய ஒரு சமூகத்தை உருவாக்க அவர் பாடுபட்டார். தமிழ் இலக்கியத்தை செழுமைப்படுத்துவதில் அவர் ஆற்றிய பங்களிப்புகளும் ஒப்பிலாதவை.” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2202146)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam