సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార భారతి ద్వారా విపత్తు హెచ్చరికలు.. సంక్షేమ పథకాలను చివరి అంచెదాకా చేర్చే వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం
· బహుళ మాధ్యమ విధానం ద్వారా ప్రాంతీయ భాషల్లో పౌరులకు విపత్తు హెచ్చరికలు
· ‘వేవ్స్ ఓటీటీ.. దూరదర్శన్ ఫ్రీ డిష్, రేడియో’ మాధ్యమాల ద్వారా గ్రామీణ.. సరిహద్దు ప్రాంతాలకు సంక్షేమ పథకాల సౌలభ్యం విస్తరణ
प्रविष्टि तिथि:
10 DEC 2025 4:03PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి గ్రామీణ, మారుమూల, సరిహద్దు ప్రాంతాలకు సంక్షేమ పథకాలు, పౌర సూచనలు, విపత్తు హెచ్చరికల సమాచార విస్తరణ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది.
తదనుగుణంగా ప్రభుత్వ ప్రసార సంస్థ ‘ప్రసార భారతి’ (దూరదర్శన్, రేడియో) పరిధిలోని ఎఫ్‌ఎం/మీడియం వేవ్/షార్ట్ వేవ్ రేడియో నెట్‌వర్కులు, భౌగోళిక టీవీ ట్రాన్స్ మిటర్లు, దూరదర్శన్ ఉచిత డిష్ సహా డిజిటల్ వేదికలు, మొబైల్ అనువర్తనాల ద్వారా ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం చేరవేస్తుంది.
నిర్దిష్ట భౌగోళిక ప్రాంత విపత్తు హెచ్చరికల చేరవేత కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సార్వత్రిక అప్రమత్తత విధానం (సీఏపీ) ఆధారిత సమీకృత అప్రమత్తత వ్యవస్థను అమలులోకి తెచ్చింది.
ఈ వ్యవస్థ ద్వారా ‘ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, సచేత్ పోర్టల్, గగన్/నావిక్ ఉపగ్రహ టెర్మినళ్లతోపాటు ఆరెస్సెస్ ఫీడ్’ల రూపంలో ప్రాంతీయ భాషలలో హెచ్చరికలు జారీ అవుతాయి.
అంతేకాకుండా ప్రచురణ-ప్రసార మాధ్యమాలు, ప్రాంతీయ భాషా సమాచారం, సంచార వాహనాలు సహా వీధి నాటక ప్రక్రియను కూడా వినియోగించుకుంటూ విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సామాజిక సంసిద్ధత ప్రాధాన్యాన్ని ‘ఎన్‌డీఎంఏ’ విస్తృతంగా వివరిస్తుంది.
ఈ విధంగా చిట్టచివరి అంచెదాకా వ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం కింది చర్యలు చేపట్టింది:
· దూరదర్శన్ ఉచిత డిష్ ద్వారా సమాచార విస్తృతి: ఇది గ్రామీణ, సరిహద్దు ప్రాంతాలు సహా దేశమంతటా నేరుగా ఇళ్లకు సమాచారం చేరవేసే (డైరెక్ట్ టు హోమ్-డీటీహెచ్) వేదిక. దీనికింద అన్ని దూరదర్శన్ చానెళ్లు, 48 రేడియో (ఆకాశవాణి) చానెళ్లు, ఎంపిక చేసిన ప్రైవేట్ చానెళ్లు సహా 260కిపైగా విద్యా చానెళ్ల నెట్ వర్క్ ఉంది.
· కేంద్రీకృత పౌర సమాచార కార్యక్రమాలు: దూరదర్శన్, ‘డీడీ న్యూస్’ రోజువారీ వార్తా బులెటిన్‌లతోపాటు “చర్చా మే, ఆపదా కా సామ్నా, కేబినెట్ కే బడే ఫైసలే, సైబర్ అలర్ట్” వంటి ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు, ప్రభుత్వ పథకాలపై నివేదికలు, విపత్తు సూచనలు-సలహాలు ప్రసారమవుతాయి.
· డిజిటల్ సౌలభ్యం బలోపేతం: సమాచారాన్ని వ్యాప్తి దిశగా ప్రసార భారతి తన విస్తృత సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుంది. ఈ మేరకు ‘ఆండ్రాయిడ్, ఐఓఎస్’ల కింద ‘న్యూస్ ఆన్ ఎయిర్’ యాప్‌లో 260కిపైగా రేడియో (ఆకాశవాణి) స్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
· వేవ్స్ ఓటీటీ వేదిక: ప్రసార భారతి ప్రారంభించిన ‘వేవ్స్’ దూరదర్శన్, ఆకాశవాణి చానెళ్ల ప్రత్యక్ష ప్రసార సౌలభ్యం కల్పిస్తుంది. అలాగే ఎంపిక చేసిన ప్రైవేట్ వార్తా- వినోద చానెళ్లను కూడా ప్రసారం చేస్తూ, పౌరులకు సమాచార సౌలభ్యాన్ని మరింత విస్తృతం చేస్తుంది.
ప్రస్తుతం కోసి, పూర్ణియా డివిజన్లలో కింది 5 ఆకాశవాణి ఎఫ్ఎం స్టేషన్లు పనిచేస్తున్నాయి:
వ.సం.
|
స్టేషన్ గల ప్రాంతం
|
జిల్లా
|
డివిజన్
|
1
|
బత్నహా (10 కి.వా.)
|
అరారియా
|
పూర్ణియా
|
2
|
కతిహార్ (100 వా)
|
కతిహార్
|
పూర్ణియా
|
3
|
కిషన్‌గంజ్ (100 వా)
|
కిషన్‌గంజ్
|
పూర్ణియా
|
4
|
పూర్ణియా (10 kW) పూర్ణియా
|
పూర్ణియా
|
పూర్ణియా
|
5
|
సహర్సా (100 W)
|
సహర్సా
|
కోసి
|
పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార-ప్రసార శాఖల సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఇవాళ లోక్‌సభలో శ్రీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2201718)
आगंतुक पटल : 10