సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ సినిమా వారసత్వ సంపద సంరక్షణ.. 1,469 సినిమాలను డిజిటైజ్ చేసిన నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్
4.3 లక్షల నిమిషాల సినిమా కథను డిజిటైజ్ చేసి, సంరక్షిస్తున్న నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా
प्रविष्टि तिथि:
10 DEC 2025 4:18PM by PIB Hyderabad
పాత చిత్రాలను పరిరక్షించేందుకు, డిజిటలైజ్ చేయడానికి భారత ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్‌ను అమలు చేస్తోంది.
ఇప్పటి వరకు 4.3 లక్షల నిమిషాల సినిమాలకు సమానమైన 1,469 టైటిల్‌లను డిజిటలైజ్ చేశారు. వీటిలో ఫీచర్లు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు ఉన్నాయి. డిజిటలైజ్ చేసి, పునరుద్ధరించిన సినిమాలను నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సంరక్షిస్తుంది. వాటిని తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
భారత ప్రభుత్వం బెంగాలీతో సహా అన్ని భారతీయ భాషల్లోని సినిమాలను రూపొందించే దర్శకులు, నిర్మాతలకు మద్దతిస్తుంది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన డెవలప్మెంట్, కమ్యూనికేషన్, డిసెమినేషన్ ఆఫ్ ఫిలిం కంటెంట్(డీసీడీఎఫ్ సీ) పథకం ద్వారా సినిమా నిర్మాణం, ప్రచారానికి ఆర్థిక, ఇతర సహాయాన్ని అందిస్తుంది.
ఇది ప్రాంతీయ సినిమాలు జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను చేరువయ్యేందుకు సహాయపడుతుంది.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నేడు లోక్‌సభలో శ్రీ నారాయణ్ టాటు రాణే, శ్రీ సౌమిత్ర ఖాన్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
(रिलीज़ आईडी: 2201706)
आगंतुक पटल : 10