ప్రధాన మంత్రి కార్యాలయం
సామాజిక కార్యకర్త శ్రీ బాబా అఢవ్ మృతిపై ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
08 DEC 2025 11:16PM by PIB Hyderabad
మహారాష్ట్రలో ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ బాబా అఢవ్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం ప్రకటించారు.
అనేక సామాజిక అంశాల మెరుగు దిశగా... ప్రత్యేకించి అణగారిన వర్గాల సాధికారత, కార్మిక సంక్షేమం కోసం ఆయన చేేసిన అవిరళ కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“అనేక సామాజిక అంశాల మెరుగు కోసం... ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పన, కార్మిక సంక్షేమం లక్ష్యంగా శ్రీ బాబా అఢవ్ నిర్విరామంగా కృషి చేశారు. సమాజ సేవలో ఆయన నిబద్ధత చిరస్మరణీయం. ఆయన మృతి ఎంతో బాధాకరం... ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2201212)
आगंतुक पटल : 6