ఆయుష్
న్యూఢిల్లీలో సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 2వ అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు భారత్ సహకారం
प्रविष्टि तिथि:
09 DEC 2025 3:22PM by PIB Hyderabad
సంప్రదాయ వైద్యంపై 2వ అంతర్జాతీయ సదస్సును డిసెంబరు 17-19 తేదీల్లో భారత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూఢిల్లీలో సంయుక్తంగా నిర్వహిస్తాయి. సంప్రదాయ వైద్యంలో ఆవిష్కరణ, ఆచరణాత్మక అభ్యసనం, భవిష్యత్తు వ్యూహాలపై మూడు రోజులపాటు సాగే ఈ సదస్సులో ప్రపంచ నాయకులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, నిపుణులు చర్చిస్తారు.
దీనికి సంబంధించి డిసెంబరు 8వ తేదీ నిర్వహించిన సన్నాహక కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ ప్రతాప్రరావు జాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- సంప్రదాయ వైద్యంలో ఇనుమడిస్తున్న భారత్ ప్రాబల్యంతోపాటు శాస్త్రీయ విశ్వసనీయత, ప్రపంచ సహకార విస్తృతి, బలోపేతంలో జాతీయ పరిశోధన సంస్థల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఆయుర్వేద పరిశోధనలు, వైద్య ప్రయోగాలకు మార్గనిర్దేశంలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ‘సీసీఆర్‌ఏఎస్’ పరిధిలోగల కేంద్రీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీఏఆర్‌ఐ) కీలక పాత్ర పోషిస్తోంది. దీనిపై ఇనిస్టిట్యూట్ తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ హేమంత పాణిగ్రాహి మాట్లాడుతూ- ‘సీఏఆర్‌ఐ’ సమగ్ర పరిశోధనలు... ముఖ్యంగా వైద్య పరీక్షలు, ప్రాథమిక-విధాన సంబంధిత పరిశోధనలు ప్రధాన జీవనశైలి, సాంక్రమికేతర వ్యాధులను నయం చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయని తెలిపారు. ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య కేంద్రాలు, ప్రస్తుత పరిశోధనాధ్యయనాలు, వృత్తిగత శిక్షణ కార్యక్రమాలు వంటివన్నీ ఆచరణాత్మక సంప్రదాయ ఆరోగ్య సంరక్షణపై జాతీయ ప్రాథమ్యాలకు అనుగుణంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నిర్వహించే సదస్సులో- ప్రపంచవ్యాప్త ప్రజారోగ్య విధానాల్లో సంప్రదాయ వైద్యాన్ని ఏకీకృతం చేసే దిశగా మంత్రి మండలి స్థాయి చర్చలు, శాస్త్రీయ బృంద గోష్ఠి, ప్రదర్శనలు, ప్రపంచ విజ్ఞాన-భాగస్వామ్య సమావేశాలు వంటివి నిర్వహిస్తారు.
***
(रिलीज़ आईडी: 2201193)
आगंतुक पटल : 4