హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ నిర్వహించిన ‘ప్రముఖ్ వర్ణి అమృత మహోత్సవ్’లో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


సబర్మతీ తీరాన ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితాన్ని ప్రదర్శించి నిజాయతీగా జీవించాలనే స్ఫూర్తిని ప్రజల్లో నింపిన బీఏపీఎస్

ఆధ్యాత్మికతను, వైష్ణవ తత్వాన్ని బోధించిన ప్రముఖ్ స్వామి మహారాజ్

ప్రతి జీవి పట్ల కరుణతో ఉండాలనే వేల ఏళ్ల సంప్రదాయాన్ని పునురుద్దరించిన ప్రముఖ్ స్వామి మహరాజ్
సాధు జీవితానికి ఆదర్శవంతమైన నమూనాను అందించిన ప్రముఖ్ స్వామి మహారాజ్

వెన్నెముకను దానం చేసిన రుషి దధీచి నుంచి సమాజ సంక్షేమ కార్యక్రమాల వరకు.. సబర్మతీ తీరం సాధువుల అంకితభావానికి కేంద్రంగా ఉంది

సమాజంలో విద్యను ప్రోత్సహించడానికి, సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వామి నారాయణ్ సంస్థ

प्रविष्टि तिथि: 07 DEC 2025 9:39PM by PIB Hyderabad

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ నిర్వహించిన ‘ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవ్’లో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారుఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘ్వి పాల్గొన్నారు.

ప్రముఖ్ స్వామి మహరాజ్ చేసిన కార్యాలనుఆధ్యాత్మిక జ్ఞాపకాలనుఅనంతమైన సద్గుణాలను మాటల్లో వర్ణించలేమని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారుప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తూ.. సబర్మతీ నదీ తీరాన ‘ప్రముఖ్ వర్ణి అమృత్ మహోత్సవ్’ను బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థ ఈ రోజు నిర్వహిస్తోందని చెప్పారుసబర్మతీ తీరాన ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితాన్ని తెలియజేస్తూ.. నిజాయతీగా జీవించాలని ప్రజలకు బీఏపీఎస్ సంస్థ స్ఫూర్తినిస్తోందని తెలియజేశారుఆయన అనుసరించిన ఆధ్యాత్మికతనువైష్ణవ తత్వాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా.. దానిని ఆచరించే అపూర్వమైన పనిని సైతం పూర్తి చేశారన్న విషయం తెలుసుకోవడం ద్వారానే అయినప్పటికీ ప్రముఖ్ స్వామి మహారాజ్ మొత్తం జీవితాన్నిసేవలను అర్థం చేసుకోగలమని వివరించారుఒక్క అక్షరాన్ని ఉచ్చరించాల్సిన అవసరం లేకుండా.. ఆచరణతోనే ఆధ్యాత్మికతను సేవతో ముడిపెట్టి ‘నరుడే నారాయణుడు’ అనే వేద సూత్రానికి ఉదాహరణగా నిలిచారన్నారు.

ప్రతి జీవి పట్ల కరుణ ప్రదర్శించాలనే వేల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ప్రముఖ్ స్వామి మహారాజ్ పునరుద్ధరించారని శ్రీ అమిత్ షా అన్నారు. ఆయన వైష్ణవ వర్గానికి మాత్రమే తన సేవలను పరిమితం చేయలేదనిఎలాంటి లోపాలు లేని తన ప్రవర్తనతో వివిధ వర్గాలకు చెందిన సాధువులమహంతుల మధ్య సామరస్యాన్నిసమన్వయాన్ని ప్రోత్సహించారన్నారుతద్వారా మొత్తం సనాతన ధర్మానికి గణనీయమైన సేవలందించారని తెలిపారుస్వాతంత్ర్యానంతరం సాధు సమాజంసన్యాసుల ఆచారాల పట్ల గౌరవ భావం క్రమంగా క్షీణించిందని తెలిపారుదానిని స్వచ్ఛతప్రవర్తనతో ప్రముఖ్ స్వామి మహారాజ్ఆయన సారథ్యంలో వేలాది మంది సాధువులు దానిని పునరుద్ధరించారని తెలిపారు.

సనాతన ధర్మం సాగించిన వేల ఏళ్ల ప్రయాణంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొందని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారుఅయితే స్వాతంత్ర్యానంతరం సాధువులుసన్యాసులకు ఇచ్చే గౌరవం తగ్గుతుండటం అతి పెద్ద సంక్షోభమని చెప్పారుదీనిని పునరుద్ధరించిన ఘనత ప్రముఖ్ స్వామి మహారాజ్‌కుబీఏపీఎస్ సంస్థకు దక్కుతుందని తెలిపారుఏ వర్గంతోనూ వివాదం లేకుండాసన్యాసిగాసాధువుగా లేదా సాధు జీవితం ఎంత స్వచ్ఛంగాపవిత్రంగాగొప్పగా ఉండాలో తన ప్రవర్తన ద్వారా ప్రముఖ్ స్వామి మహారాజ్ ఉదాహరణగా నిలిచారని శ్రీ షా అన్నారుసనాతన ధర్మం నిత్యం అందించే జ్ఞానం జీవితానికి ఎలా ఆధారంగా నిలుస్తుందో ఆయన నిరూపించారుదాని నుంచి స్వీకరించిన జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఆడంబరం లేకుండా పంచిపెట్టారుదీనిని జీవితాంతం ఆయన సాధన చేశారు.

సామాజిక జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులకు, సనాతన ధర్మానికి ఆయన జీవితాంతం విద్యార్థిగానే ఉన్నారని శ్రీ అమిత్ షా తెలిపారుస్వాతంత్ర్యానంతరం ప్రజల హృదయాల్లో విశ్వాసం క్షీణించడమనే పెద్ద సమస్య సనాతన ధర్మానికిసాధువులుసన్యాసుల సంప్రదాయానికి ఎదురైందని ఆయన అన్నారుదీనిని ప్రముఖ్ స్వామి మహారాజ్ పరిష్కరించారని తెలిపారుఈ విషయంలో ఆయన ఒక్క మాట కూడా బోధించకుండా.. తన ప్రవర్తనవేలాది మంది సాధువుల సాయంతో సాధించారన్నారుసనాతన ధర్మంలోని సన్యాసులకు సార్వత్రికంగా ఆమోదం పొందిన మార్గాన్ని వేసి.. వారికి మార్గదర్శిగా నిలుస్తున్నారని కొనియాడారు.

సాధువులు నడయాడిన చరిత్ర పవిత్ర సబర్మతీ నదీ తీరానికి ఉందని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారుతన వెన్నెముకను దానం చేసిన రుషి దధీచి నుంచి.. సామాజిక సంక్షేమ కార్యక్రమాల వరకు సాధువుల నిబద్దతకు సాక్ష్యంగా సబర్మతీ తీరం నిలించిందని వివరించారుఈ సబర్మతీ తీరం నుంచే అహింససత్యాగ్రహం అనే ఆయుధాలను ఉపయోగించి ప్రపంచంలోనే తిరుగులేని రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని చెప్పారుఅహ్మదాబాద్‌లోని అంబ్లీవాలి పోల్ గుడిలో 1950లో బీఏపీఎస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు ప్రముఖ్ స్వామి మహారాజ్ అంగీకరించారని తెలియజేశారు. 1950 నుంచి 2016 వరకు ఆయన చేసిన కృషి స్వామి నారాయణ్ సంస్థకు మాత్రమే కాకుండా.. దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారుఅంబ్లీవాలీ పోల్షాపూర్ ప్రాంతాల గురించి సాధువులు తమ ప్రసంగాల్లో ఎక్కువ ప్రస్తావించారన్నారుఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం అంబ్లీవాలీ పోల్ ఖ్యాతి గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. దేశమంతా వ్యాపిస్తుందనిప్రపంచానికి మరచిపోలేని పుణ్యక్షేత్రంగా మారుతుదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సన్యాస జీవితాన్ని స్వీకరించిన యువ సాధువు యోగీజీ మహారాజ్‌ను తన వారసుడిగా శాస్త్రీజీ మహారాజ్ ఎంపిక చేసిన ప్రదేశం. గురువు తన శిష్యుడిని పరీక్షించినశిష్యుడు తన సర్వస్వాన్ని గురువు పాదాల ముందు ఉంచిన ప్రదేశంఅహంకారంసామాజిక బేధం లేకుండా ధర్మానికిప్రపంచ సంక్షేమానికి అంకితమయ్యే ప్రధాన బాధ్యతను ప్రముఖ్ స్వామి మహారాజ్‌కు అప్పగించిన ప్రదేశంఇది సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి పవిత్ర పుణ్యతీర్థంగా మారుతుందనే విశ్వాసాన్ని శ్రీ అమిత్ షా వ్యక్తం చేశారు.

విద్యను ప్రోత్సహించడానికి, సామాజిక రుగ్మతలను తొలగించడానికి స్వామి నారాయణ్ సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర హోంసహకార మంత్రి అన్నారుఈ కార్యక్రమాన్ని కూడా అదే స్ఫూర్తితో రూపొందించారుఇది సాధువుల జీవితం ఎలా ఉండాలోవారి నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనకు బోధిస్తుంది.


(रिलीज़ आईडी: 2200669) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Assamese , Gujarati , Telugu