పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఇండిగో నిర్వహణ సంక్షోభం - విమాన ఛార్జీల నియంత్రణపై పౌర విమానయాన శాఖ చర్యలు
అన్ని ప్రభావిత మార్గాల్లో ధరలు న్యాయంగా, హేతుబద్దంగా ఉండేలా తన నియంత్రణాధికారాలను ఉపయోగించిన పౌరవిమానయాన శాఖ
प्रविष्टि तिथि:
06 DEC 2025 12:25PM by PIB Hyderabad
ప్రస్తుతం విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అసాధారణమైన రీతిలో అధిక ఛార్జీలను వసూలు చేయడాన్ని పౌర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణించింది. ధరల దోపిడీ ఏ రూపంలో ఉన్నా దాని నుంచి ప్రయాణికులను రక్షించేందుకు, అన్ని ప్రభావిత మార్గాల్లోనూ ధరలు న్యాయంగా, హేతుబద్దంగా ఉండేలా చూసేందుకు తన నియంత్రణాధికారాలను మంత్రిత్వ శాఖ ఉపయోగిస్తోంది.
ప్రస్తుతం నిర్దేశించిన ధరల పరిమితులను అన్ని విమానయాన సంస్థలు కచ్చితంగా పాటించాలని అధికారిక ఆదేశం జారీ అయింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయి. మార్కెట్లో ధరల అంశంలో క్రమశిక్షణను కొనసాగించడం, క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను దోపిడీ చేయకుండా నివారించడం, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రోగులతో సహా అత్యవసర ప్రయాణాలు చేసే వారికి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవడమే ఈ ఆదేశానికున్న ప్రధాన లక్ష్యం.
రియల్ టైం డేటా, విమానయాన సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ వేదికలతో సమన్వయం చేసుకుంటూ ధరల స్థితిగతులను మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. నిర్దేశించిన పరిమితులను అతిక్రమించిన సందర్భాలు ఎదురైతే.. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే దిద్దుబాటు చర్యలను చేపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2200038)
आगंतुक पटल : 6